Hyderabad, April 14: దేశంలో ప్రాణాలను పణంగా పెట్టి పేష్ంట్ల ప్రాణాలు కాపాడుతున్న వైద్యులకు (Doctors) రక్షణ ఉండంటం లేదు. వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో (Telangana) వైద్యులపై దాడి జరిగింది. ఉస్మానియా ఆస్పత్రి (Osmania General Hospital) ఐసోలేషన్ వార్డులో ఉన్న కొందరు వ్యక్తులు మంగళవారం వైద్యులపై దాడికి దిగారు.
39 లక్షల రైల్వే టికెట్లు రద్దు, ఇప్పటికే రైల్వే టికెట్ బుక్ చేసుకున్నవారికి మొత్తం రీఫండ్
పాజిటివ్ వచ్చిన వారితో కలిపి తమను వార్డులో ఉంచడం ఏమిటంటూ అనుమానిత లక్షణాలతో ఉన్న ఓ వ్యక్తి బంధువులు తోపులాటకు, వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ జరుగుతుండగానే.. అనుమానితుడిని అతని కుమారుడు చెప్పాపెట్టకుండా పాతబస్తీలోని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. తీరా అనంతరం వచ్చిన రిపోర్టులో అతని తండ్రికి పాజిటివ్ రావడం మరింత కలకలం సృష్టించింది.
ఉస్మానియా ఆస్పత్రి ఏఎంసీ వార్డులో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులో 12 మందిని చేర్చగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఈ ఇద్దరినీ గాంధీ ఆస్పత్రికి (Gandhi Hospital) తరలిస్తుండగా మిగిలిన వారు ఈ వార్డులో ఉండలేమని, డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్లిపోతామంటూ ఆందోళనకు దిగారు. అయితే టెస్ట్ రిపోర్టులు రావాలని, అందులో నెగెటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తామని, అప్పటివరకు సంయమనం పాటించాలని విధుల్లో ఉన్న జూనియర్ వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఓ జూనియర్ వైద్యుడు కిందపడిపోయారు.
ముంబై బాంద్రాలో వలస కార్మికుల ఘోష
ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యులపై దాడి చేయడం హేయమన్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, వైద్యులకు రక్షణ కల్పిస్తామని హామీనిచ్చారు. సమస్యను పరిష్కరించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌లోనే ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేసిన బాధితుడి తరపు బంధువులను కఠినంగా శిక్షించాలని, వైద్యులకు రక్షణ కల్పించాలంటూ పలువురు జూనియర్ డాక్టర్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఐసోలేషన్ వార్డుల్లో పనిచేస్తున్న జూడాలకు కనీస రక్షణ లేదని, ఇటు వైరస్‌తో, అటు రోగులతో ఇబ్బంది పడుతున్నామని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాజిటివ్ వచ్చిన వారి పక్కనుంటే తమకూ వైరస్ సోకుతుందనే భయంతోనే అలా ప్రవర్తించామని, వైద్యుల మనసు నొప్పించినందుకు తమను క్షమించాలని, వైద్యులపై తమకెలాంటి ద్వేషం లేదని దాడికి పాల్పడిన వ్యక్తులు క్షమాపణ కోరారు.