AP Coronavirus: గుంటూరులో కరోనా కల్లోలం, వంద దాటిన కరోనా కేసులు, ఏపీలో 473కి చేరిన కోవిడ్ 19 కేసుల సంఖ్య, నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మృతి
Coronavirus in India (Photo Credits: IANS)

Amaravati, April 14: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) తాజాగా మరో 34 కరోనావైరస్‌ (Coronavirus) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 473కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన 34కేసుల్లో గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదైంది.

ఇండియాలో 10 వేలు దాటిన కరోనావైరస్ కేసులు

ఇప్పటి వరకు 14 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 9 మంది మృతి చెందారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 450కి చేరింది. ఇక గుంటూరులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వంద దాటింది. ఇప్పటి వరకు గుంటూరులో 109 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ప్రధాని మోదీ సప్తపది సూత్రాలు, లాక్‌డౌన్ కాలంలో ఈ నియమాలు పాటించాలని పిలుపు

కర్నూలులో 91, నెల్లూరులో 56, ప్రకాశంలో 42, కృష్ణా 44, వైఎస్సార్‌ జిల్లాలో 31, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో 200 మందికి, వారితో కాంటాక్ట్‌ అయిన 189 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

Here's Tweet

లాక్‌డౌన్ (Lockdown) మే 3 వరకూ పొడిగింపు

నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మృతి నమోదైంది. కరోనా పాజిటివ్‌తో తీవ్ర అస్వస్థతకు గురైన నెల్లూరు ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.అలాగే సోమవారం జిల్లాలో మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా నెల్లూరులో 56 కేసులు నమోదయ్యాయి.

లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ వచ్చేశాయి

దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి (Modi address to nation) ప్రసంగిచారు. కరోనావైరస్ (Coronavirus) నియంత్రణ కోసం మే 3 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు (India Lockdown Extended) నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కష్టమైనా, నష్టమైనా రాజ్యాంగంలో వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న పదానికి ప్రజలు సంపూర్త నిదర్శనంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. భారత్ అంటేనే భిన్నసంస్కృతులు, మతాలు, ఉత్సవాలు అని తెలిపారు