Odisha pension Scheme: పెన్సన్ కష్టాలు ఇంత దారుణంగా ఉంటాయా, పెన్సన్ కోసం 120 ఏళ్ల తల్లిని బ్యాంకుకు మంచం మీద ఈడ్చుకువెళ్లిన కూతురు, షాక్ తిన్న బ్యాంక్ అధికారులు
ఒడిషాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చాలా మందిని కలచివేస్తోంది. వృద్ధాప్య పెన్షన్ కోసం మంచాన పడిన 120 ఏళ్ల తల్లిని బ్యాంకుకు ఓ కూతురు మంచంమీద ఈడ్చుకుని తీసుకువెళ్లింది. ఒడిశా రాష్ట్రంలోని నౌపద జిల్లాలో (Naupada District) ఈ ఘటన వెలుగుచూసింది. నౌపద జిల్లాలో ఖరియర్ బ్లాకులోని బరాగన్ గ్రామానికి చెందిన లాభీ బాగేల్ అనే 120 ఏళ్ల వృద్ధురాలు (Bedridden Mother) అనారోగ్యంతో మంచాన పడ్డారు. వృద్ధురాలైన లాభీ బాగేల్ తనకు రావాల్సిన 1500రూపాయల పించన్ తీసుకురమ్మని తన కుమార్తె అయిన గుంజాదేవిని బ్యాంకుకు పంపించింది.
Nuapada, June 15: వృద్ధాప్య పెన్షన్ (pension Scheme) కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒడిషాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చాలా మందిని కలచివేస్తోంది. వృద్ధాప్య పెన్షన్ కోసం మంచాన పడిన 120 ఏళ్ల తల్లిని బ్యాంకుకు ఓ కూతురు మంచంమీద ఈడ్చుకుని తీసుకువెళ్లింది. ఒడిశా రాష్ట్రంలోని నౌపద జిల్లాలో (Naupada District) ఈ ఘటన వెలుగుచూసింది. నౌపద జిల్లాలో ఖరియర్ బ్లాకులోని బరాగన్ గ్రామానికి చెందిన లాభీ బాగేల్ అనే 120 ఏళ్ల వృద్ధురాలు (Bedridden Mother) అనారోగ్యంతో మంచాన పడ్డారు. వృద్ధురాలైన లాభీ బాగేల్ తనకు రావాల్సిన 1500రూపాయల పించన్ తీసుకురమ్మని తన కుమార్తె అయిన గుంజాదేవిని బ్యాంకుకు పంపించింది. కరోనాని కట్టడి చేయడం ఎలా ? రాష్ట్రాల సీఎంలతో మరోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, దేశంలో 3 లక్షల 50 వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు
అయితే బ్యాంకు అధికారులు తల్లికి ఇవ్వాల్సిన పెన్షన్ కూతురికి ఇవ్వమని, ఫిజికల్ వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు తీసుకురావాలని ఆమెను కోరారు. దీంతో చేసేదిలేక 70 ఏళ్ల గుంజాదేవి తన 120 ఏళ్ల వయసుగల తల్లిని మంచంపైనే పడుకోబెట్టి ఏకంగా ఆ మంచాన్నే బ్యాంకుకు లాక్కోచ్చింది. బ్యాంకుకు తీసుకువచ్చిన వృద్ధురాలితోపాటు కూతుర్ని చూసిన బ్యాంకు అధికారులు పెన్షన్ డబ్బును విడుదల చేశారు.
హృదయవిదారకమైన ఈ ఘటన వీడియో ట్విట్టర్ లో పెట్టడంతో రూ.1500 పెన్షన్ ఇచ్చేందుకు ఇద్దరు వృద్ధ మహిళలను ఇబ్బంది పెట్టిన బ్యాంకుఅధికారులపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.ఈ ఘటనతో వృద్ధులకు పెన్షన్ ను ఇంటివద్దే అందించాలని బీఎంసీ కమిషనర్ ప్రేమ్ చంద్ చౌదరి అన్ని బ్యాంకుల మేనేజర్లు, రిజర్వ్ బ్యాంకులకు లేఖలు రాశారు.