Odisha Shocker:పెళ్లికి ఒప్పుకోని పెద్దలు, ఊరి బయట ప్రియుడు ఆత్మహత్య, నీవు లేని చోట నేనుండలేనంటూ ప్రియురాలు కూడా అదే చోట ఉరివేసుకుని ఆత్మహత్య, ఒడిషాలో విషాద ఘటన

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువజంట.. బుధవారం ఊరిబయట ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఒకరిని విడిచి మరొకరం ఉండలేమంటూ (Girl hangs self after lover dies) ప్రాణాలొదిలారు.

Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Ganjam, May 26: ఒడిషాలో విషాదకర ఘటన చోటు (Odisha Shocker) చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువజంట.. బుధవారం ఊరిబయట ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటూ.. ఒకరిని విడిచి మరొకరం ఉండలేమంటూ (Girl hangs self after lover dies) ప్రాణాలొదిలారు. సమాచారం అందుకున్న జరడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

జరడా పోలీసు అధికారులు, బాధిత గ్రామస్తులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బరంపురం నగరానికి సమీపంలోని పత్రపూర్‌ బ్లాక్‌ జరడా పోలీసు స్టేషన్‌ పరిధిలో సమంతరాయ్‌పల్లి గ్రామానికి చెందిన సోను బెహరా(20), సునీత ప్రధాన్‌(18) గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకు వెళ్లగా.. వారు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన సోను బెహరా గ్రామ శివారులోని మామిడి తోటలో చెట్టుకి సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య (dies by suicide in Ganjam district) చేసుకున్నాడు.

భార్య ఉన్నా పక్కోళ్లతో సెక్స్, కోపం ఆపుకోలేక సుత్తితో మొగుడ్ని చంపించిన భార్య, వికాస్‌ నగర్‌ హత్య కేసును చేధించిన పోలీసులు

విషయం తెలుసుకున్న ప్రేమికురాలు సునీత ప్రధాన్‌ ఘటనా స్థలానికి చేరుకుంది. అయితే, అక్కడే ఉన్న బాధిత కుంటుంబ సభ్యులు.. సునీతను తీవ్రంగా దూషించారు. దీంతో ఇంటికి వెళ్లిపోయిన ఆమె, కొద్ది సమయం తరువాత తిరిగి వచ్చి, పక్కనే ఉన్న మరో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న జరడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రేమజంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఐఐసీ బాబానాంద తెలిపారు.



సంబంధిత వార్తలు

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి