Odisha Floods: భారీ వరదలకు కొట్టుకుపోయిన కారు, చెట్టు అడ్డం రావడంతో వెంటనే ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న ఇద్దరు వ్యక్తులు

రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్న కారును ఒక్కసారిగా వరదలో చిక్కుకుపోయింది. అందులో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు.

Odisha Floods (Photo-ANI)

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్న కారును ఒక్కసారిగా వరదలో చిక్కుకుపోయింది. అందులో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందు ఒకరు చెట్టెక్కగా.. మరొకరుపై కారుపైనే కూర్చొని.. అటువైపుగా వచ్చిన వారిని సహాయం చేయాలని వేడుకున్నారు. సమాచారం అందుకున్న ఒడిశా స్టేట్‌ డిజాస్టర్‌ రిలీప్‌ పోర్స్‌ సిబ్బంది.. వరదలో చిక్కుకుపోయిన ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు.

వివరాల్లోకెళితే.. జగత్‌పూర్‌ సింగ్‌ జిల్లా ధిర్నాకియాకు చెందిన రష్మీ రంజన్‌ స్వైన్‌, కేంద్రపారా జిల్లా పట్కురా గ్రామానికి చెందిన ప్రశాంత్‌ మొహంతి ఇద్దరు రహ్మా – ఖోసల్‌పూర్‌ రహదారిపై వెళ్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా మహానదిలో నీటిమట్టం భారీగా పెరిగింది. ఆ తర్వాత నీరు రోడ్డుపైకి చేరింది. నీటిలో కారు కొట్టుకుపోయి ఓ చెట్టు వద్ద తట్టుకొని ఆగిపోయింది.

సరదా కోసం వెళ్లి జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు, వీడియో చూస్తే కింద గుండె గులాబ్ జాం ఖాయం..

కారులో ఉన్న ఇద్దరు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు మొదట కారు టాప్‌పైకి చేరుకున్నారు. నీటి ఉధృతి ఎక్కువ కావడంతో కారు చిక్కుకున్న చెట్టును ఎక్కారు. ఇందులోనే ఒకరు సాహసం చేసి కారుపైనే కూర్చొని అక్కడ సమీపంలోని వంతెనగుండా వెళ్తున్న వారిని చూసి కేకలు వేశారు. దీంతో వారు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరిన సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించి కారులో చిక్కుకున్న వారిని కాపాడారు.



సంబంధిత వార్తలు