Student Molested: రోడ్డుపై వెళ్తున్న స్కూల్ విద్యార్ధినిని ఆటోలోకి లాగి అఘాయిత్యం, ఎందుకు కామెంట్ చేశావని అడిగినందుకు మృగంలా ప్రవర్తించిన ఆటో డ్రైవర్, సీసీటీవీలో రికార్డయిన అకృత్యం
మహిళ అతడిని వదిలిపెట్టలేదు. అతను ఆటోను పోనివ్వడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతని చేతిని పట్టుకుంది. ఆటోను వేగంగా పోనివ్వడంతో మహిళ వాహనంతో పాటు దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి కిందపడింది.
Thane, OCT 14: విద్యార్థిని పట్ల ఓ ఆటోడ్రైవర్ (Auto driver) దారుణంగా ప్రవర్తించాడు. వేధింపులకు గురిచేసి ఆటోతో ఈడ్చుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా (viral) మారింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో (Thane) శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. మహిళకు సుమారు 21 ఏళ్లు ఉంటాయని అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఆటోడ్రైవర్ ను పట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 6.45 గంటల సమయంలో విద్యార్థిని బజార్‌పేట రోడ్డులో నడుచుకుంటూ కళాశాలకు వెళ్తుంది. రోడ్డు పక్కనే ఉన్న ఆటోరిక్షా డ్రైవర్ (Auto driver)మహిళ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసాడు. ఆమె అతనిని ప్రశ్నించడంతో అతను ఆమె చేయి పట్టుకుని లాగినట్లు (Student Molested) సీనియర్ ఇన్‌స్పెక్టర్ జైరాజ్ రాణావేర్ తెలిపారు.
దీంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా.. మహిళ అతడిని వదిలిపెట్టలేదు. అతను ఆటోను పోనివ్వడం ప్రారంభించాడు. దీంతో ఆమె అతని చేతిని పట్టుకుంది. ఆటోను వేగంగా పోనివ్వడంతో మహిళ వాహనంతో పాటు దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి కిందపడింది. ఆ తర్వాత నిందితుడు ఆటోను మరింత వేగంగా పోనిచ్చి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో (CCTV) రికార్డయ్యాయి.
తీవ్రగాయాలతో రోడ్డుపక్కన పడిఉన్న విద్యార్థినిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ మా వద్ద ఉందని థానే నగర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్ స్పెక్టర్ జైరాజ్ రన్వేర్ తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని అన్నారు. విద్యార్థినికి ఎడమ చేయి, కాలుపై గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని అన్నారు. ఐపీసీ సెక్షన్ 354, 354A (లైంగిక వేధింపు) కింద కేసు నమోదు చేశారు.