Free Bus Travel for Women: మహిళా దినోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్, ఇవాళ ఏ బస్సులో ఎక్కినా టికెట్ లేదు, స్త్రీలకు స్పెషల్ ఆఫ్ ఇచ్చిన బెంగళూరు ఆర్టీసీ
ఇవాళ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టికెట్ ఉండదని ప్రకటించింది. అయితే ఇది తెలుగురాష్ట్రాల్లో కాదు.కర్ణాటక రాజధాని బెంగళూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ‘బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC)’
Bengaluru , March 08: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆర్టీసీ. ఇవాళ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టికెట్ ఉండదని ప్రకటించింది. అయితే ఇది తెలుగురాష్ట్రాల్లో కాదు.కర్ణాటక రాజధాని బెంగళూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ‘బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC)’. మహిళా దినోత్సవమైన బుధవారం రోజు బెంగళూరులో మహిళలు ఏ బస్సులోనైనా ఉచితంగా (bus travel is free for women) ప్రయాణించవచ్చని బీఎంటీసీ ప్రకటించింది. సాధారణ బస్సులతోపాటు నగర పరిధిలోని ప్రీమియర్ ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా (bus travel is free for women)ప్రయాణించవచ్చని తెలిపింది. కెంపెగౌడ నుంచి ఎయిర్‌పోర్టు వరకు నడిపే వజ్ర, వాయు వజ్ర సర్వీసుల్లోనూ టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు.
మహిళలు ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ వాడే బదులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు (Public Transport) సర్వీసు వాడాల్సిందిగా బీఎంటీసీ అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ తగ్గుతుందని, ఇది సురక్షితమైన ప్రయాణమని అంటున్నారు.దీనివల్ల నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా మెరుగవుతుందని అభిప్రాయపడింది. గతంలో బెంగళూరులో ఒక్కసారి మాత్రమే బస్సుల్లో బీఎంటీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బీఎంటీసీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా గత ఏడాది ఆగష్టు 15న మాత్రమే ఈ అవకాశం కల్పించింది. ఇప్పుడు మరోసారి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మహిళా దినోత్సవం రోజు బస్సు సౌకర్యం కల్పించడం మాత్రం ఇదే మొదటిసారి.