PM Modi Speech in Ayodhya: రాముడు క్షమిస్తాడని నాకు నమ్మకం ఉంది, అయోధ్యలో ఉద్వేగంగా ప్రసంగించిన ప్రధాని మోదీ, పూర్తి స్పీచ్ సారాంశం ఇదిగో..

అయోధ్య(ayodhya)లో ప్రతిష్ఠాత్మక రామ మందిర్(ram mandir) శంకుస్థాపన కార్యక్రమం(జనవరి 22న) ఘనంగా పూరైంది. శ్రీరాముడి జన్మస్థానంలో బాల రాముడి విగ్రహం కొలువుదీరింది. ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువులో పాల్గొన్నారు. ఇందుకోసం 11 రోజుల ఉపవాస దీక్ష చేపట్టారు.

PM Modi Apologise to Lord Shri Ram

Ayodhya, Jan 22: అయోధ్య(ayodhya)లో ప్రతిష్ఠాత్మక రామ మందిర్(ram mandir) శంకుస్థాపన కార్యక్రమం(జనవరి 22న) ఘనంగా పూరైంది. శ్రీరాముడి జన్మస్థానంలో బాల రాముడి విగ్రహం కొలువుదీరింది. ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ క్రతువులో పాల్గొన్నారు. ఇందుకోసం 11 రోజుల ఉపవాస దీక్ష చేపట్టారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం అయోధ్యలో ఉద్వేగంగా (PM Modi Speech in Ayodhya) ప్రసంగించారు. శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ‍ప్రసంగం ప్రారంభించారు. రామ భక్తులందరికీ తన ప్రణామాలు తెలిపారు.

ఈ సందర్భంగా రామాయణ ఇతిహాసంలోని పాత్రలైన శబరి, గుహుడు, ఉడత, జటాయువు గురించి ప్రస్తావించారు. నవ భారత నిర్మాణానికి ఆయా పాత్రల నుంచి ఎలా స్ఫూర్తి పొందాలో దేశప్రజలకు వివరించారు.అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరు కావడం తన అదృష్టమని తెలిపారు. రామ్‌లల్లా ఇక టెంట్‌లో ఉండేపరిస్థితులు లేవని.. దివ్యమైన మందిర గర్భగుడిలోనే ఉంటారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. ఇది సామాన్యమైన సమయం కాదని.. కాల చక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయయని తెలిపారు.

రేపటి నుంచే సామాన్యులకు బాల రాముడి దర్శనం, ఐడీ కార్డు తప్పనిసరి, భక్తుల దర్శనం టైమింగ్స్ పూర్తి వివరాలు ఇవిగో..

ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మన రాముడొచ్చాడన్న మోదీ (Our Ram has arrived) ఈ క్షణం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. ఎంతో అలౌకిక ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఎక్కడ రాముడు కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని తెలిపారు. సేవా, చింతర, భక్తిని హనుమంతుడి నుంచి ప్రేరణ పొందాలని అన్నారు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్న సరికొత్త అధ్యాయమని చెప్పారు.

‘సరయూ నది, అయోధ్యపురికి (Ayodhya temple) నా ప్రణామాలు. నా శరీరం ఇంకా అనుభూతిని ఆస్వాదిస్తోంది. రాముడు క్షమిస్తాడని నాకు నమ్మకం ఉంది. నా మనస్సంతా బాలరాముడి రూపంపైనే ఉంది. త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. రాముడి కోసం 14 ఏళ్లుగా ప్రజలు ఎదురు ఎదురు చూశారు. ఈ కలియుగంలో కొన్ని వందల ఏళ్లు రాముడి కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.

వీడియో ఇదిగో, ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్య రామాలయంపై పూలవర్షం, బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో పూల వర్షం

దేశం మొత్తం ఇవాళ దీపావళి జరుపుకుంటోంది. రామమందిర న్యాయబద్దమైన ప్రక్రియ ద్వారా నిర్మించాం. 500 ఏళ్లుగా రామమందిర నిర్మాణం ఎందుకు జరగలేదో ఒకసారి అందరూ ఆలోచించండి. రాముడు భారతదేశ ఆత్మ. ఈ 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టా. అన్ని రాష్ట్రాల్లోని ఉన్న రాముడి ప్రధాన ఆలయాలు దర్శించుకున్నాను. అన్ని భాషల్లోనూ రామాయనాన్ని విన్నాను. భాష ఏదైనా రాముడు అందరికీ ఆరాధ్య దైవం. రాముడు లోకానికి ఆదర్శం. రాముడు భారత్‌కు ప్రతిష్ట. రాముడు వివాదం కాదు.. రాముడు సమాధానం. రాముడే భారతదేశానికి విధానం. రాముడు నిత్యం, రాముడు నిరంతరం, రాముడు అనంతం.

బానిస సంకెళ్లను తెంచుకున్న కొత్త రాజ్యం ఆవిర్భవించింది. ఈనెల గాలి ప్రతీది దివ్యత్వంతో నిండిపోయింది. ఈ ఘట్టం కోసం శ్రీరాముడు ఎన్నో శతాబ్ధాల పాటు ఎదురు చూశాడు. ఇంత ఆలస్యం జరిగింనందుకు మమ్మల్ని క్షమించమని శ్రీరాముడిని వేడుకుంటున్నా రాముడు తప్పక వస్తాడన్న శబరి ఎదురుచూపులు ఫలించాయి. దేవుడి నుంచి దేశం.. రాముడి నుంచి రాజ్యం ఇది మన నినాదం. త్రేతా యుగంలో రాముడు వచ్చాకే వేలయేళ్లపాటు ఈ దేశం ప్రపంచాన్ని శాసించింది రాబోయే వెయ్యేళ్ల కోసం నేడు పునాదిరాయి వేస్తున్నాం’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు.

త‌న 11 రోజుల ఉప‌వాస దీక్ష‌లో తాను రాముడు న‌డ‌యాడిన ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. నాసిక్‌లోని పంచ్‌వ‌టి ధామ్‌, కేర‌ళ‌లో త్రిప్ర‌య‌ర్ ఆల‌యం, ఏపీలో లేపాక్షి ఆల‌యం, శ్రీరంగంలోని శ్రీరంగ‌నాధ‌స్వామి ఆల‌యం, రామేశ్వ‌రం, ధ‌నుష్కోడిలోని రామ‌నాధస్వామి ఆల‌యాల‌ను ద‌ర్శించుకున్నాన‌ని చెప్పారు.

స‌ముద్రం నుంచి స‌ర‌యూ న‌ది వ‌ర‌కూ అదే పండుగ స్ఫూర్తితో ప్ర‌తిచోటా శ్రీరామ నామం ధ్వనించింద‌ని అన్నారు. దేశం ఆత్మ‌లోని ప్ర‌తి అణువుతోనూ శ్రీరాముడు అనుసంధాన‌మై ఉన్నాడ‌ని పేర్కొన్నారు. భార‌తీయుల హృద‌యాల్లో రాముడు కొలువై ఉన్నాడ‌ని చెప్పారు. ప్ర‌జ‌ల జ్ఞాప‌కాల్లో, సంప్ర‌దాయ పండుగ‌ల్లో రాముడి ప్ర‌స్తావ‌న ఉంద‌ని చెబుతూ ప‌లు భాష‌ల్లో తాను శ్రీరామ క‌థ‌ను విన్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

ప్ర‌భు శ్రీరాముడి క్ష‌మాప‌ణలు కోరుతున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.త‌మ ప్ర‌య‌త్నంలో జ‌రిగిన లోపాలు, త‌మ త్యాగంలో జ‌రిగిన లోపాలు ఉంటే త‌మ‌ను క్ష‌మించాల‌ని ప్ర‌ధాని మోదీ కోరారు. ఇన్ని శ‌తాబ్ధాల నుంచి ఈ ప‌ని జ‌ర‌గ‌నందుకు క్ష‌మాప‌ణలు కోరుతున్న‌ట్లు చెప్పారు. శ్రీరామ‌జ‌న్మ‌భూమిలో రామాల‌య నిర్మాణం పూర్తి అయ్యింద‌ని, శ్రీరాముడు క‌చ్చితంగా క్ష‌మిస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు మోదీ తెలిపారు.

రాముడి రూపంలో దేశం చైత‌న్య మందిరంగా మారింద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. రామ మందిర నిర్మాణం కోసం ద‌శాబ్దాల పాటు న్యాయ పోరాటం సాగింద‌ని, న్యాయ‌మైన తీర్పును ఇచ్చిన న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు ఆయ‌న ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ తెలిపారు. భ‌వ్య భార‌త్‌, విక‌సిత భార‌త్‌కు ఈ అయోధ్యా మందిరం ఆధారంగా నిలుస్తుంద‌న్నారు.భార‌త్ ఇప్పుడు ముందుకు వెళ్తుంద‌న్నారు. అభివృద్ధిలో అగ్ర‌ప‌థానికి చేరుకుంటామ‌న్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now