Ram-Lalla-Idol-HD-Wallpapers-1

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్, రేపు జనవరి 23 నుండి రామ్ లల్లా దర్శనం ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ మేరకు రామ మందిర తీర్థ క్షేత్ర కమిటీ భక్తుల దర్శనం, రాంలాల హారతి సమయాలను వెల్లడించింది.

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెబ్‌సైట్ ప్రకారం రాంలాలా దర్శనం కోసం ప్రతిరోజూ వేర్వేరు సమయ వ్యవధిని ప్రకటించింది. ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు భక్తులు శ్రీరాముడి విగ్రహ దర్శనానికి అవకాశం కల్పించారు. దీని తర్వాత కొన్ని గంటలపాటు గర్భగుడి తలుపులు మూసి ఉంచుతారు. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు తలుపులు తెరుచుకుని రాత్రి 7 గంటల వరకు భక్తులు రాంలాలా దర్శనం చేసుకోవచ్చు. వీడియో ఇదిగో, ఆర్మీ హెలికాప్టర్లతో అయోధ్య రామాలయంపై పూలవర్షం, బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో పూల వర్షం

ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించిన రాంలాలా విగ్రహానికి ప్రతి రోజూ రెండుసార్లు హారతి నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 6.30 గంటలకు, సాయంత్రం 7.30 గంటలకు హారతి ఇస్తారు. అయితే హారతి సమయంలో సాధారణ ప్రజలను ఆలయంలోకి అనుమతించరు. ఏ భక్తుడైనా హారతి దర్శనం చేసుకోవాలనుకుంటే వారు ప్రత్యేక పాస్ తీసుకోవాల్సి ఉంటుంది.

Here's Video

ఈ పాస్‌లను తీర్థయాత్ర వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో పొందవచ్చు. జన్మభూమిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆఫ్‌లైన్‌లో కూడా పొందవచ్చు. అయితే ఆలయానికి వచ్చే భక్తులు మాత్రం పాస్ కోసం చెల్లుబాటు అయ్యే IDని చూపించడం తప్పనిసరి.