Black Cobras in Pot: ఒకే ఇంట్లో 90 బ్లాక్ కోబ్రాస్, మట్టికుండలో కుప్పలు కుప్పలుగా బయటపడ్డ పాములు, భయాందోళనలో గ్రామస్తులు, మనుషుల్ని తినే జాతికి చెందిన పాములు కావడంతో ఆందోళన
ఇంట్లోని పాతమట్టికుండను తెరిచి చూడగా ఇవి కనిపించాయి. అంబేద్కర్ నగర్ జిల్లాలోని (ambedkar nagar) అలపూర్ తహసీల్ పరిధిలోని మదువానా గ్రామంలో ఈ నాగు పాములు వెలుగు చూశాయి. గ్రామంలోని ఒక వ్యక్త తన ఇంటిలోని పాత మట్టి కుండను (Pot) తెరిచిచూడగా పాములు కనపడ్డాయి.
Uttarpradesh, May 11: ఉత్తరప్రదేశ్ లోని (Uttarpradesh) ఒకఇంట్లో 90 నల్లనాగుపాములు(Black Cobras) బయటపడ్డాయి. ఇంట్లోని పాతమట్టికుండను తెరిచి చూడగా ఇవి కనిపించాయి. అంబేద్కర్ నగర్ జిల్లాలోని (ambedkar nagar) అలపూర్ తహసీల్ పరిధిలోని మదువానా గ్రామంలో ఈ నాగు పాములు వెలుగు చూశాయి. గ్రామంలోని ఒక వ్యక్త తన ఇంటిలోని పాత మట్టి కుండను (Pot) తెరిచిచూడగా పాములు కనపడ్డాయి. ఇవి కోబ్రా జాతికి చెందినవి అని, చాలా డేంజరస్ పాములు అంటూ అధికారులు చెప్తున్నారు. కోబ్రా జాతికి చెందిన పాములు (Snakes) 90 వరకు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కేవలం అక్కడ మాత్రమే ఉన్నాయా? లేకపోతే ఇంట్లో ఇంకా ఎక్కడైనా పాము పిల్లలు ఉన్నాయా? అని వెతికారు.
మనుషులు తిరిగే ఇంట్లో విషసర్పాలు ప్రత్యక్షమవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. విషసర్పాలను బంధించి పట్టుకెళ్లారు. వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. అయితే.. ఒకేచోట భారీగా పాములు కనిపించటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇంతటితో సర్పాలన్నింటినీ అధికారులు పట్టుకెళ్లారా..? ఇంకా మిగిలి ఉన్నాయా..? అనే అనుమానంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
ప్రస్తుతానికి అయితే అటవీశాఖ అధికారులు నల్ల నాగు పాములను పట్టుకుని అడవి లో వదిలేశారు. పాములను చూసి ఎవరూ భయపడవద్దని వారు గ్రామస్తులకు సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒక నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.