Pending Cases in Courts: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు, యూపీలోనే 1.18 కోట్ల కేసులు, లోక్ సభ వేదికగా వెల్లడించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
ఈ మేరకు శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. వీటిల్లో గరిష్ఠంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్ ప్రదేశ్‌లోని సబార్డినేట్ కోర్టుల్లోనే ఉన్నాయి
5 Crore Cases Pending in Courts: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో కలిపి దాదాపు 5 కోట్లకు పైనే కేసులు పెండింగులో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్ సభ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. వీటిల్లో గరిష్ఠంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్ ప్రదేశ్‌లోని సబార్డినేట్ కోర్టుల్లోనే ఉన్నాయి. కార్గిల్ యుద్ధం నుంచి పాకిస్తాన్ ఇంకా పాఠాలు నేర్చుకోలేదు, శత్రుదేశానికి ధీటైన బదులిస్తామని కార్గిల్ నుంచి ప్రధాని మోదీ హెచ్చరిక
మొత్తంగా 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో సుప్రీంకోర్టులో 84,045, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి మేఘ్వాల్ వెల్లడించారు. అత్యధికంగా జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లోనే 4,53,51,913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కోర్టుల్లో సరిపడా భౌతికపరమైన వనరులు లేకపోవడం, కేసుల్లోని వాస్తవాలు తేలడంలో సంక్లిష్టత, సాక్ష్యాలు, లిటిగేషన్లు.. ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్ పడుతున్నాయని తెలిపారు.