Girls Drown in Swimming Pool: ఈత రాక స్విమ్మింగ్ ఫూల్ లో మునిగి ముగ్గురు యువతులు మృతి.. కర్ణాటకలో ఘటన.. వైరల్ వీడియో

ఈత రాక స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతి చెందారు. బాధిత యువతులను కీర్తన (21), నిశిత (21), పార్వతీ (20)గా గుర్తించారు.

Girls Drown in Swimming Pool (Credits: X)

Bengaluru, Nov 18: కర్ణాటకలోని (Karnataka) ఉల్లాల్లో ఉన్న ఓ రిసార్ట్ లో ఘోరం జరిగింది. ఈత రాక స్విమ్మింగ్ పూల్లో (Swimming Pool) మునిగి ముగ్గురు యువతులు మృతి చెందారు. బాధిత యువతులను కీర్తన (21), నిశిత (21), పార్వతీ (20)గా గుర్తించారు. స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ సేదతీరుతూ ఉన్న యువతులు లోతు ఎక్కువగా ప్రాంతానికి తెలియకుండానే వెళ్లారు. దీంతో మునిగిపోయారు. పూల్ డెక్కు చేరడానికి తీవ్రంగా శ్రమించినా అది ఫలించకపోవడంతో చివరికి మృత్యువాతపడ్డారు. మృతులు మైసూరుకు చెందిన వారిగా గుర్తించారు.

హైడ్రా 2.0.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. సంగారెడ్డిలో కూల్చివేతలు షురూ.. (వీడియో)

Here's Video:

అదుపులోకి యజమాని

ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిసార్ట్ యజమాని, మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. యువతులు మునిగిపోతున్న వీడియో వైరల్ అయింది.

ముహూర్త సమయం ముగిసిపోతున్నది.. వరుడు ఇక్కడ.. పెండ్లి అక్కడ.. దీంతో వరుడి కోసం ఆగిన రైలు.. ఏంటా సంగతి??



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif