Padma Awards 2021: తెలుగు రాష్ట్రాల నుంచి 4 గురికి పద్మ అవార్డులు, రాష్టపతి భవన్‌లో ఘనంగా పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం, అవార్డులు అందుకున్న వారి పూర్తి జాబితా ఓ సారి చూద్దామా..
2020 సంవత్సరంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) పద్మ అవార్డులు (Padma Awards 2021) ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
New Delhi, Nov 8: పద‍్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్‌లో ఘనంగా జరుగింది. 2020 సంవత్సరంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) పద్మ అవార్డులు (Padma Awards 2021) ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉన్నారు. 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డు ప్రకటించారు.
మొత్తం 119 అవార్డుల్లో 7 పద్మ విభూషణ్, 10 పద్మ భూషణ్, 102 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. మొత్తం 119 మందిలో 29 మంది మహిళలు ఉన్నారు. స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషణ్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు (Kangana Ranaut) పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి (Adnan Sami ) పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు.తెలంగాణ కళాకారుడు కనకరాజుకి పద్మశ్రీ అవార్డు దక్కింది. మరణానంతరం అరుణ్ జైట్లీకి పద్మ విభూషన్, సుష్మా స్వరాజ్‌కు పద్మభూషణ్ ను, మనోహర్ పారికర్ పద్మభూషణ్, జార్జి ఫెర్నాండేజ్ విశ్వేశ్వర తీర్ధ స్వామీజీలకు అవార్డులను ప్రకటించారు. సుష్మా స్వరాజ్ తరపున ఆమె కుమార్తె బన్సూరి స్వరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. రామస్వామి అన్నవరపు (కళారంగం), ప్రకాశ్ రావు అసవడి (సాహిత్యం, విద్య), నిడుమోలు సుమతి (కళలు) ఏపీ నుంచి అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి కనకరాజును కళారంగంలో పద్మశ్రీ వరించింది.
Check 119 Awards Full List Here
పద్మ అవార్డులు స్వీకరించిన వారిలో ఓ ట్రాన్స్‌జెండర్ కూడా ఉన్నారు. ఇక వైద్య రంగంలో ఎయిర్ మార్షల్ డాక్టర్ పద్మ భందోపాద్యాయకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు. పండిత్ చెన్నులాల్ మిశ్రా, మేరీకోమ్, అనిరుధ్ జుగనౌద్ మిశ్రాలు పద్మ విభూషణ్ అందుకున్నారు. పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాకు పద్మ భూషణ్ ప్రకటించారు.