Mamta Kulkarni (Photo Credits: Instagram)

New Delhi, Feb10:  కిన్నర్ అఖాడా (Kinnar Akhada) మహామండలేశ్వర్ (Mahamandaleshwar) పదవికి బాలీవుడ్ నటి (Bollywood Actress) మమతా కులకర్ణి (Mamata Kulkarni) రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె Instaలో ఒక వీడియోను  షేర్ చేశారు. మమతా కులకర్ణి నియామకంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నర్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

వీడియోలో ఆమె మాట్లాడుతూ..  25 ఏళ్లుగా నేను సాధ్విగా ఉన్నాను, ఇకముందు కూడా ఇలాగే కొనసాగుతాను. మహామండలేశ్వర్‌గా నన్ను నియమించడంపై గొడవ పడటం సరికాదు. 25 ఏళ్ల క్రితమే నేను బాలీవుడ్‌ను విడిచిపెట్టాను. అప్పట్నించీ అందరికీ, అన్నింటికీ దూరంగా ఉంటూ వచ్చానని తెలిపారు. నేను కైలాస్‌కో, మానస సరోవర్‌కో వెళ్లనక్కర లేదు. 25 ఏళ్ల తపస్సుతో విశ్వం నా కళ్లముందే ఉంది.’ అని తెలిపారు.

పేరెంట్స్‌ శృంగారంపై పనికిమాలిన వ్యాఖ్యలు, దయచేసిన నన్ను క్షమించండి అంటూ వీడియో విడుదల చేసిన యూట్యూబర్ రణ్‌వీర్‌ అలహబాదియా

కాగా 90వ దశకంలో బాలీవుడ్‌లో వెలుగు వెలిగిన నటి మమతా కుల్‌కర్ణి 2003 తర్వాత సినిమ రంగం నుంచి తప్పుకొని విదేశాలకు వెళ్లిపోయారు. అప్పట్లో డ్రగ్స్‌ రాకెట్‌లో ఆమె పేరు కూడా వినిపించింది. ఇన్నేళ్ల తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్‌కు వచ్చిన ఆమె కిన్నర్‌ అఖాడాలో చేరి.. తన పేరును ‘మాయీ మమతానంద్‌ గిరి’గా మార్చుకున్నారు.

Mamta Kulkarni Resigns As Mahamandaleshwar of Kinnar Akhara

మహామండలేశ్వర్‌గా మమతా కులకర్ణిని నియమించడంపై అఖాడా సాధువులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రిషి అజయ్ దాస్ చర్యలు తీసుకున్నారు. మమతా కులకర్ణిని, లక్ష్మీనారాయణ్‌ త్రిపాఠిని పదవుల నుంచి తొలగించారు. అజయ్‌ దాస్‌ చర్యలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహామండలేశ్వర్ పదవి నుంచి తనను తొలగించడంపై లక్ష్మీనారాయణ్ త్రిపాఠి అభ్యంతరం వ్యక్తంచేశారు. అఖారా నుంచి 2017లో బహిష్కృతుడైన అజయ్ దాస్ తనను పదవి నుంచి తొలగించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.