Padma Awards 2022: రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం, ఇద్దరికి పద్మ విభూషణ్‌, ఎనిమిది మందికి పద్మభూషణ్‌, 54 మందికి పద్మశ్రీ అవార్డుల సత్కారం

2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో అందించిన సేవలకు గాను అవార్డులను ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపతి ఇద్దరికి పద్మ విభూషణ్‌, ఎనిమిది మందికి పద్మభూషణ్‌, 54 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు.

Padma Awards 2022 Photo: Twitter

New Delhi, Mar 21: దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం (Padma Awards 2022) కార్యక్రమం జరిగింది. 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో అందించిన సేవలకు గాను అవార్డులను ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపతి ఇద్దరికి పద్మ విభూషణ్‌, ఎనిమిది మందికి పద్మభూషణ్‌, 54 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. తెలంగాణకు చెందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగులయ్య (mogulaiah) పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఏపీకి చెందిన గ‌రిక‌పాటి న‌ర‌సింహా రావు (garikapati) కూడా ప‌ద్మ‌శ్రీ అవార్డును రాష్ట్రప‌తి చేతుల మీదుగా అందుకున్నారు.

ప‌ద్మ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో భాగంగా ప‌ద్మ భూష‌ణ్ అవార్డును క‌రోనా వ్యాక్సిన్ ను త‌యారు చేసిన సీరం అధినేత పూనావాలా అందుకున్నారు. అదే విధంగా ఇటీవ‌లే హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన డిఫెన్స్ స్టాప్ చీఫ్ బిపిన్ రావ‌త్‌కు (CDS Bipin Rawat) ద‌క్కిన ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును ఆయ‌న కుమార్తెలు అందుకున్నారు. సాహిత్యం, విద్యారంగంలో చేసిన కృషికి రాధే శ్యామ్‌ ఖేమ్కా దివంగత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (మరణానంతరం) పద్మ విభూష‌ణ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డులను రాధే శ్యామ్‌ ఖేమ్కా తనయుడు, బిపిన్‌ రావత్‌ కుమార్తెలు కృతిక, తారిణి అవార్డును రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) పద్మభూషణ్‌ అవార్డును రాష్ట్రపతి నుంచి స్వీకరించారు.

పద్మశ్రీ అవార్డును అందుకున్న మొగులయ్య, గ‌రిక‌పాటి న‌ర‌సింహా రావు, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం

పారాలింపిక్‌ విజేత దేవేంద్ర ఝఝరియా (పద్మభూషణ్‌), స్వామి సచ్చిదానంద (పద్మభూషణ్‌), హాకీ ప్లేయర్‌ వందనా కటారియా (పద్మశ్రీ), పారా షూటర్ అవనీ లేఖరా (పద్మశ్రీ), యోగా రంగంలో చేసిన విశేష కృషికి స్వామి శివానంద పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ సంవత్సరం 128 పద్మ అవార్డులను ప్రకటించగా.. రెండు విడుతల్లో అవార్డులను ప్రదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాలుగు పద్మ విభూషణ్‌, 17 పద్మ భూషణ్‌, 107 పద్మశ్రీ అవార్డులను కేంద్రం వివిధ రంగాల్లో చేసిన కృషికి అవార్డులను ప్రకటించింది. 34 మంది మహిళలు, మరణానంతరం 13 మందికి, పలువురు విదేశీలకు సైతం కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది.



సంబంధిత వార్తలు

Maharashtra Election Result 2024: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, 288 నియోజకవర్గాల వారీగా గెలిచిన అభ్యర్థుల జాబితా ఇదిగో

Jharkhand Election Result 2024: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాలుగో సారి సీఎం కాబోతున్న హేమంత్‌ సొరేన్‌, 56 స్థానాల్లో జేఎంఎం కూటమి విజయభేరి, 26 స్థానాలతో సరిపెట్టుకున్న ఎన్డీఏ కూటమి

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే