Nuclear Battle: భారత్‌తో అణుయుద్ధం తప్పదంటున్న పాకిస్తాన్, ముస్లింలను కాపాడుకుంటూ భారత భూభాగాన్ని టార్గెట్ చేస్తాం, సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌

దాయాది దేశం కయ్యానికి కాలు దువ్వేందుకు రెడీ (Pakistan vs India) అవుతోంది. ముఖ్యంగా కాశ్మీర్ (Kashmir) విషయంలో ఆగ్రహంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఇండియాపై (India-Pak Tensions) యుద్ధం చేయడానికి సై అంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని..అణు యుద్ధం అనివార్యమని ఆయన (Pakistan minister Sheikh Rasheed) హెచ్చరించారు. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కేవలం భారత భూభాగాన్నే లక్ష్యంగా చేసుకుంటాయని ( Pakistan warns of nuclear battle with India) తెలిపారు.

PM Narendra Modi and Pakistan's Premier Imran Khan. (Photo Credits: PTI)

New Delhi/Islamabad, August 20: దాయాది దేశం కయ్యానికి కాలు దువ్వేందుకు రెడీ (Pakistan vs India) అవుతోంది. ముఖ్యంగా కాశ్మీర్ (Kashmir) విషయంలో ఆగ్రహంతో రగిలిపోతున్న పాకిస్తాన్ ఇండియాపై (India-Pak Tensions) యుద్ధం చేయడానికి సై అంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని..అణు యుద్ధం అనివార్యమని ఆయన (Pakistan minister Sheikh Rasheed) హెచ్చరించారు. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కేవలం భారత భూభాగాన్నే లక్ష్యంగా చేసుకుంటాయని ( Pakistan warns of nuclear battle with India) తెలిపారు.

తమ ఆయుధాలు విస్పష్టంగా లక్ష్యాలకు గురిపెడతాయని పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ (Sheikh Rasheed Ahmad) అన్నారు. పాక్‌ టీవీ సామా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్‌పై భారత్‌ దాడికి దిగితే సంప్రదాయ యుద్ధానికి అవకాశం లేదని, ఇది భీకరంగా సాగే అణుయుద్ధానికి దారితీస్తుందని అన్నారు.

పాకిస్తాన్‌ సంప్రదాయ యుద్ధానికి దిగే అవకాశం లేదని, దీంతో ఏదైనా జరిగితే పొరుగు దేశం అంతమవుతుందని భారత్‌ ఇది గుర్తెరగి మసలుకోవాలని ఆయన హెచ్చరించారు. అయితే పాకిస్తాన్‌ అణుయుద్ధం ప్రస్తావన తెస్తూ భారత్‌ను హెచ్చరించడం ఇది తొలిసారి కాదు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం భారత్‌తో అణు యుద్ధంపై గత ఏడాది పలు సందర్భాల్లో మాట్లాడారు. ఇక కశ్మీర్‌ అంశంపై చైనా మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌ అంశంతో పాటు భారత్‌-చైనా సరిహద్దు ప్రతిష్టంభనలపైనా చర్చించేందుకు పాక్‌ విదేశాంగ మంత్రి మక్దూమ్‌ షా మహ్మద్‌ ఖురేషి బీజింగ్‌ పర్యటనకు బయలుదేరివెళ్లారు.

Pakistan Minister Sheikh Rasheed Threatens India With Nuclear war:

ఇదిలా ఉంటే ఇండియాపై ఆధిపత్యం సాధించేందుకు పాకిస్తాన్ పొరుగుదేశం చైనాతో జత కట్టింది. పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మక్దూమ్‌ షా మహ్మద్‌ ఖురేషి చైనాతో వ్యూహాత్మక సంప్రదింపుల కోసం బీజింగ్‌ బయలుదేరారు. చైనానే తమకు నిజమైన మిత్రదేశమని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఖురేషి చైనా పర్యటన ఇప్పుడు తీవ్ర ఉత్కంఠతను రేపుతోంది. బీజింగ్‌లో ఖురేషి చైనా విదేశాంగ మంత్రి సహా దౌత్యవేత్తలతో సంప్రదింపులు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పాకిస్తాన్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటన ఏర్పాట్లపై ఖురేషి చైనా విదేశాంగ మంత్రితో చర్చిస్తారని సమాచారం. ఫేక్ వీడియో పోస్ట్ చేసి దొరికిపోయిన పాక్ ప్రధాని

ఈ సమావేశంలో కశ్మీర్‌ అంశంతో పాటు తూర్పు లడఖ్‌లో ఇండో-చైనా ప్రతిష్టంభనపైన చర్చలు జరగనున్నాయని సమాచారం. సౌదీఅరేబియాతో పాకిస్తాన్‌ సంబంధాలు దెబ్బతిన్నాయని వార్తల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీతో తమ సంబంధాలు బెడిసికొట్టలేదని ఓ టీవీ ఇంటర్యూలో స్పష్టం చేశారు. 2018లో తాము ఇచ్చిన 3 బిలియన్‌ డాలర్ల రుణంలో 1 బిలియన్‌ డాలర్లను తక్షణమే చెల్లించాలని సౌదీ అరేబియా పాకిస్తాన్‌ను కోరినప్పటి నుంచి పాక్ డ్రాగన్‌ వైపు దృష్టి సారించింది.

ఇదిలా ఉంటే కశ్మీర్‌ అంశంపై చర్చించేందుకు ఇస్లామిక్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటునకు రియాద్‌ నిరాకరించడంతో ఖురేషి చేసిన ఘాటు వ్యాఖ్యలపై పాక్‌ ఇంటా బయటా వివాదం నెలకొంది. సౌదీతో సంబంధాలు దెబ్బతినకుండా పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బాజ్వా సౌదీ అరేబియా సందర్శించాల్సి వచ్చింది. సౌదీ అరేబియా చొరవ చూపకుంటే కశ్మీర్‌పై ఇతర ముస్లిం దేశాలను సంప్రదిస్తామని ఖురేషి చేసిన వ్యాఖ్యలు సౌదీకి ఆగ్రహం కలిగించాయి. నా విమానం నాకు తిరిగి ఇచ్చేయ్, ఇమ్రాన్‌ఖాన్‌కి షాకిచ్చిన సౌదీ యువరాజు

ఈ పరిస్థితులు ఇలా ఉంటే.. ఉగర్‌ ముస్లింలు, వారి మత విశ్వాసాల పట్ల చైనా అనుచిత వైఖరికి అద్దం పట్టే మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముస్లింల ప్రార్థనా స్థలం మసీదును కూల్చివేసి ఆ ప్రదేశంలో పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్మించిన డ్రాగన్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాయువ్య చైనాలో గల జిన్‌జియాంగ్‌ (జిన్‌జియాంగ్‌ ఉగర్‌ అటానమస్‌ రీజియన్‌(ఎక్స్‌యూఏఆర్‌)ను స్వయంప్రతిపత్తి గల ప్రాంతంగా గుర్తించిన డ్రాగన్‌.. అక్కడ నివసిస్తున్న వేలాది ముస్లింలను అనధికారికంగా నిర్బంధించిన విషయాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్టులు ప్రపంచానికి తెలియజేసిన విషయం తెలిసిందే.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now