Pakistan magazine claims Saudi Prince called back Imran Khan plane (Photo-Ians)

Islamabad,October 7:  గత నెలలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐరాస వేదికగా ఇండియా మీద తన అక్కసును వెళ్లకక్కిన సంగతి అందరికీ విదితమే. యుద్ధం వస్తే ఎదుర్కొవడానికి సిద్ధమంటూ ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్, ఆర్ఎస్ఎస్, మోడీ టార్గెట్ గా ఇమ్రాన్ ఖాన్ విమర్శలు గుప్పించారు. అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాలు తలపడితే ప్రపంచమంతా బాధ్యత వహించాల్సి వస్తుందని ఇండియా మీద నిప్పులు గక్కారు. ఈ విషయం సైదీ యువరాజుని ఇబ్బందులకు గురి చేసినట్లుంది. యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లి (యుఎన్‌జిఎ) లో ఇమ్రాన్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలపట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అందుకని అరేబియా పర్యటన సందర్భంగా ఇమ్రాన్‌కు సమకూర్చిన ప్రైవేటు విమానాన్ని తిరిగి వెనక్కు ఇవ్వాల్సిందిగా సౌదీ యువరాజు మొహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కోరారు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ ఫ్రైడే టెమ్స్ ప్రచురించింది. కాగా సౌదీ అమెరికానుంచి యుఎన్‌జిఎ సమావేశాలకు వెళుతున్న సమయంలో సౌదీ యువరాజు తన ప్రైవేటు విమానాన్ని ఇమ్రాన్‌ఖాన్‌కు సమకూర్చారు.

ఈ కథనం పాకిస్తాన్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడీ కథనంపై పాక్ లో చర్చ సాగుతుండగా, ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం ఈ వార్త అవాస్తవమని ఖండిస్తున్నారు. ఇది నిరాధార కథనమని, సౌదీ అరేబియాతో పాక్ కు సత్సంబంధాలున్నాయని అంటున్నారు. ప్రజాస్వామ్యం ద్వారానే ప్రయత్నించండి (Tryst with democracy) అంటూ పాక్ మ్యాగజైన్ ఎడిటోరియల్ కథనాన్ని ప్రచురించింది. ఇందులో జాతి పిత గాంధీని పొగుడుతూ రాశారు. ఇండియా ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్యదేశమనే నినాదాన్ని మోడీ పక్కకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య యుతంగానే సమస్యను ముందుకు తీసుకువెళ్లాలని రచయిత తన అభిప్రాయాన్ని వెలువరించారు.