New Delhi, January 3: భారతదేశంపై ఎప్పుడూ విషం కక్కుతూ, దేశానికి కీడు తలపెట్టే అవకాశాల కోసం అణ్వేషించే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి అలాంటి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. మోదీ సర్కార్ పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఆమోదించిన తర్వాత చెలరేగిన నిరసనలను ఒక అవకాశంగా తీసుకొని ఇండియాలో మత విద్వేషాలు (Communal Riots) పెరిగేలా, అంతర్జాతీయంగా భారత్ కు చెడ్డ పేరు తీసుకొచ్చేలా దుష్ప్రచారం (Fake Propaganda) చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముస్లింలపై భారత పోలీసులు తమ దేశంలో ఏ విధంగా హింసకు పాల్పడుతున్నారో చూడండి అంటూ ఒక వీడియోను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఆ వీడియోలో ముస్లింలపై పోలీసులు రక్తం వచ్చేలా కొట్టడం, తుపాకులతో కాల్చడం లాంటి హింసాత్మకమైన సన్నివేశాలు ఉన్నాయి.
CAAను వ్యతిరేకించే నిరసనకారుల పట్ల ముఖ్యంగా ముస్లింల పట్ల భారతదేశంలో పరిస్థితి ఇలా ఉంటుంది అనేట్లుగా ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు చేస్తున్నారు.
అయితే, ఇమ్రాన్ పోస్ట్ చేసిన వీడియోను 'ఫ్యాక్ట్ చెక్' చేయగా ఆ వీడియో బంగ్లాదేశ్ దేశానికి చెందినది అని తేలింది. దానిలోని విజువల్స్ లో స్పష్టంగా పోలీసులపై RAB అనే రాత కనిపిస్తుంది. RAB అంటే Rapid Action Battalion. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటుచేయబడిన బంగ్లాదేశ్ ఉన్నతస్థాయి పోలీసు విభాగం.
ఇమ్రాన్ ఖాన్ పోస్ట్ చేసిన వీడియో ఇదే:
అయితే విషయం బయటపడటంతో ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆయన ట్వీట్ కు సంబంధించిన ఆధారాలు నెటిజన్లు భద్రపరిచారు.
Update by ANI:
Prime Minister of Pakistan Imran Khan tweets an old video of violence from Bangladesh and says, 'Indian police's pogrom against Muslims in UP.' pic.twitter.com/6SrRQvm0H9
— ANI (@ANI) January 3, 2020
ఇంతటితో ఆగకుండా, భారత ప్రధాని నరేంద్ర మోదీని 'అంతర్రాష్ట్ర ఉగ్రవాది' గా చెబుతూ ఇండియాలో మైనారిటీల పట్ల అత్యంత అత్యంత అనాగరికంగా ప్రవర్తిస్తున్నా, అంతర్జాతీయ సమాజం ప్రేక్షకుడిలా చూస్తూ మౌనం పాటిస్తుంది ఎందుకు? మోదీ సర్కార్ క్రూరత్వాన్ని ఐక్యరాజ్యసమితి ఇంకా ఎంతకాలం ప్రోత్సహిస్తుందంటూ, ఇమ్రాన్ ఖాన్ ఉర్దూలో మరో ట్వీట్ చేశారు.
పాకిస్థాన్ ప్రధానమంత్రి స్థానంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ తమ దేశ వ్యవహారాల కంటే ఇండియా అంతర్గత వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు. ప్రధానమంత్రి స్థాయిని మరిచి ఫేక్ వీడియోలు పెట్టడం, దుష్ప్రచారాలు చేసి పరువుపోగోట్టుకోవడం ఆయనకు కొత్తేమి కాదు. అయినా కుక్కతోక వంకర అన్నట్లుగా అత్యంత చిల్లర వ్యక్తిగా, హీనబుద్ధితో తన చెత్త ప్రవర్తనను అంతర్జాతీయంగా చూపించుకుంటారు.
సిఎఎ, ఎన్‌ఆర్‌సి లకు వ్యతిరేకంగా ఇండియాలో ఉన్న ప్రతిపక్షాల కంటే దీటుగా స్పందిస్తూ మోదీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు ఇమ్రాన్ ఖాన్. మోదీ సర్కార్ పౌరసత్వచట్టాన్ని ప్రవేశపెట్టడం అనేది "నాజీ జర్మనీ" నుంచి ప్రేరణ పొందిన నియంతృత్వమైన చర్య అని, ఈ అంశంపై భారత ప్రభుత్వాన్ని నిలదీయకపోతే అది ప్రపంచంలో ఉన్న మైనారిటీలందరిపై అతిపెద్ద హింసకు దారితీస్తుందని ఇమ్రాన్ ఖాన్ గొంతు చించుకొని ఆరోపిస్తున్నారు.