Palghar Mob Lynching Case: పాల్గర్‌ సాధువుల హత్య కేసును వాదిస్తున్న లాయర్ రోడ్డు ప్రమాదంలో మృతి, కేసు విష‌యమై కోర్టుకు వెళుతున్న సమయంలో ఘటన

ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఆయన కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ ( Road Accident) కొట్టింది. కేసు విష‌యమై కోర్టుకు వెళుతున్న సమయంలోఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కారు ప్రమాద సమయంలో లాయర్ దిగ్విజ‌య్‌తో పాటు ఓ మ‌హిళ కూడా కారులో ఉంది. ఈ ప్రమాదంలో లాయ‌ర్ త్రివేది (Advocate Digvijay Trivedi) అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా, తీవ్ర గాయాల‌ పాలైన ఆమెను ఆసుప‌త్రిలో చేర్చించారు.

Advocate Digvijay Trivedi Dies in Road Accident (Photo Credits: Twitter/@Palghar_Police)

Palghar, May 15: పాల్గర్‌‌ జిల్లా మూకదాడి కేసులో హ‌త్య‌కు గురైన సాధువుల (Palghar Mob Lynching Case) త‌ర‌పున వాదిస్తున్న జూనియ‌ర్ న్యాయ‌వాది దిగ్విజయ్ త్రివేది (Digvijay Trivedi) బుధవారం రోడ్డు ప్ర‌మ‌దంలో మ‌ర‌ణించారు. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఆయన కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ ( Road Accident) కొట్టింది. కూలీలను వెంటాడిన మృత్యువు, ప్రకాశం జిల్లాలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్, 9 మంది అక్కడికక్కడే దుర్మరణం

కేసు విష‌యమై కోర్టుకు వెళుతున్న సమయంలోఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కారు ప్రమాద సమయంలో లాయర్ దిగ్విజ‌య్‌తో పాటు ఓ మ‌హిళ కూడా కారులో ఉంది. ఈ ప్రమాదంలో లాయ‌ర్ త్రివేది (Advocate Digvijay Trivedi) అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా, తీవ్ర గాయాల‌ పాలైన ఆమెను ఆసుప‌త్రిలో చేర్చించారు.

ఈ కారు ప్ర‌మాదంపై బీజేపీ నాయకుడు సంబిత్ పత్రా అనుమ‌నాలు వ్య‌క్తం చేశారు. ఎవ‌రైనా కుట్ర ప‌న్ని ఈ ఘాతానికి తెగ బ‌డ్డారా లేక ఇది యాదృచ్ఛిక‌మా? అని ఆయన ప్ర‌శ్నించారు. దీంతో పాటుగా ఇది వ‌ర‌కే ఫాల్గ‌ర్ కేసును లేవ‌నెత్తిన వారిపై కొంద‌రు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విష‌యాన్ని గుర్తుచేశారు. అయితే ప్ర‌మాదంపై ఆర్టీఓ నుంచి నివేదిక వ‌చ్చాకే నిజ‌నిజాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని పాల్గ‌ర్ కేసులో త్రివేదితో పాటు వాదిస్తున్న మ‌రో లాయ‌ర్ పిఎన్ ఓజా పేర్కొన్నారు.

Palghar Police Tweet:

Sambit Patra Tweet:

ఏప్రిల్ 16న మహారాష్ట్రలోని పాల్గర్‌ జిల్లాలో ముగ్గురు సాధువులు హత్యకు గురయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం విదితమే. పాల్గార్‌ జిల్లాలోని దబాధి ఖన్వేల్‌ రహదారిని ఆనుకుని ఉన్న ఓ గ్రామం మీదుగా కారులో సూరత్‌ వెళ్తున్న ముగ్గురు సాధువుల‌ను ఆపి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. వీరిని దొంగలుగా భావించి కారు నుంచి కిందకు దింపి రాళ్లు, ఇనుపరాడ్లతో చితకబాదారు. ఈ ఘటనలో సాధువుల‌ను ఉద్దేశ పూర్వ‌కంగానే చంపేసిన‌ట్లు బీజేపీ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.