Amaravati, May 14: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ (Naguluppalapadu Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఏడుగురు మహిళలు కాగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వలస కార్మికులను వెంటాడిన రోడ్డు ప్రమాదాలు, మధ్య ప్రదేశ్‌లో 8 మంది మృతి, ఉత్తరప్రదేశ్‌లో 6 మంది దుర్మరణం, ఎంపీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన యూపీ సీఎం
కూలీలు మిర్చి పనులకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం (Prakasam tractor accident) జరిగింది. వీరంతా మాచవరానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో మాచవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూలీ పనులు ముగిసిన అనంతరం కూలీలతో బయల్దేరిన ట్రాక్టర్ (tractor)అతి వేగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపడి ట్రాక్టర్ మీద పడటంతో పాటు, విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్‌లో డ్రైవర్‌తో కలిపి 23మంది ఉన్నారు. ప్రమాదానికి కారణం అతి వేగంతో పాటు, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. వలస కూలీల ఘోషలో ఓ పేజీ, 9 నెలల గర్బిణీ 70 కిలోమీటర్లు నడిచింది, మార్గం మధ్యలో ప్రసవం, మళ్లీ బిడ్డను ఎత్తుకుని 160 కిలోమీటర్లు నడిచింది
మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో మాచవరం ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది.
ప్రకాశం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ప్రమాద ఘటనపై మంత్రి బాలినేని శ్రీనివాస్ (Minister Balineni Srinivas) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ. 5 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.