Bhopal, May 14: లాక్‌డౌన్ కష్టాలు (Coronavirus lockdown) సామాన్యులకు పెద్ద శాపంలా మారాయి. ముఖ్యంగా వలస కార్మికులకు (migrant labourers) గూడు లేక, ఆదాయం లేక... సొంతింటికి చేరే మార్గం లేక .. ఒక్కో జాతీయ రహదారిలో లక్షల కొద్దీ జనం అలా నడుచుకుంటూ ఇళ్లకు పోయారు. వారంతా వందల కిలోమీటర్లు కూడా నడిచారు. ఇంకా బాధాకర విషయం ఏంటంటే.. ఓ నిండు గర్బిణీ 9 మాసాల కడుపుతో 70 కిలోమీటర్లు నడిచాక బిడ్డ పుట్టగా... సగం ఆకలితో బిడ్డను ఎత్తుకుని 160 కిలోమీటర్లు నడిచింది. అన్ని కిలోమీటర్ల అనంతరం ఒక మనసున్న పోలీసు అధికారి గమనించి మిగతా 700 కిలోమీటర్లకు రవాణ సదుపాయం కల్పించారు. ఈ విషాద ఘటన మద్య ప్రదేశ్ లో జరిగింది. వివరాల్లోకెళితే..
మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh) సాత్నా జిల్లాకు చెందిన శకుంతల, ఆమె భర్త మహారాష్ట్రలోని (Maharashtra) నాసిక్ నగరానికి చేరుకుని కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మార్చి నెల 25వ తేదీ నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ అమలులోకి రావడంతో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్లు అదే రాష్ట్రంలో చిక్కుకుపోయారు. లాక్ డౌన్ నియమాలను సడలించిన కేంద్ర ప్రభుత్వం వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అవకాశం ఇచ్చింది. లాక్‌డౌన్ 4కు సిద్ధమవండి, మే 18లోపు పూర్తి వివరాలు, కరోనాపై పోరాటంలో అలసిపోవద్దు, కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
ఈ నేపథ్యంలోనే సాత్నా జిల్లాకు చెందిన నిండు గర్భిణి శకుంతల, ఆమె భర్త పని చేస్తున్న ఫ్యాక్టరీలు మూసి వెయ్యడడంతో సొంత ఊరికి వెళ్లడానికి నిర్ణయించారు. శకుంతల, ఆమె భర్త రైళ్లో, బస్సులో వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో జాతీయ రహదారి మీదుగా సాటి కార్మికులతో కలిసి సొంత ఊరికి నడిచి బయలుదేరారు. శకుంతల 9 నెలల నిండు గర్భిణి.
Here's the tweet:
MP: A pregnant migrant worker who was walking back to her village in Satna from Nashik in Maharashtra amid #CoronavirusLockdown, delivered a child on the way. Her husband says, "after she gave birth we rested for 2 hours then we walked for at least 150 km." (12.5) pic.twitter.com/WubC97wabz
— ANI (@ANI) May 13, 2020
తనతో పాటు తన బిడ్డ ప్రాణాలు లెక్కచెయ్యని శకుంతల సొంత ఊరికి బయలుదేరింది. కరోనా వైరస్ భయంతో ఎవ్వరూ నిండుగర్బిణి శకుంతలకు ఏ వాహనంలో కూడా డ్రాప్ ఇవ్వడానికి సాహసం చెయ్యలేకపోయారు. ఇదే సమయంలో ఊరికి నడిచి వెలుతున్న సమయంలోనే శకుంతల ఆగ్రా – ముంబయి జాతీయ రహదారి పక్కన శకుంతల పండంటి బిడ్డకు (Migrant Worker Delivers Baby) జన్మనిచ్చింది. రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజి, ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం చేయాల్సిందే, భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం నమ్ముతోంది, జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
బిడ్డకు జన్మనిచ్చిన శంకుతల పచ్చి బాలింత అని కూడా లెక్క చెయ్యకుండా కేవలం ఒక గంట సేపు మాత్రమే విశ్రాంతి తీసుకుని తరువాత సొంత ఊరికి బయలుదేరింది. ఊరి సమీపంలోకి చేరుకుంటున్న సమయంలో స్థానిక పోలీసు ఇన్స్ పెక్టర్, అధికారులు ఓ వాహనం తెప్పించి శకుంతల, ఆమె బిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇద్దరికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. సొంత ఊరికి చేరుకోవాలనే నిర్ణయించుకున్న తరువాత తన భార్య శకుంతల ప్రాణాలకు తెగించి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత 160 కిలోమీటర్లు నడిచి వచ్చిందని ఆమె భర్త ANIకు మీడియాకు చెప్పారు.