Madhya Pradesh, May 14: లాక్‌డౌన్ వలసకూలీల పాలిట శాపంగా మారింది. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో కాలినడకన సొంతూర్ల బాట పట్టిన వలసకూలీలు వరుసగా రోడ్డు ప్రమాదాల బారీన (Major Accidents in UP and MP) పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ల్రాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 14 మంది వలస కూలీలు మృతి చెందారు. వివరాల్లోకెళితే.. వలస కూలీల ఘోషలో ఓ పేజీ, 9 నెలల గర్బిణీ 70 కిలోమీటర్లు నడిచింది, మార్గం మధ్యలో ప్రసవం, మళ్లీ బిడ్డను ఎత్తుకుని 160 కిలోమీటర్లు నడిచింది
మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లా కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం (Madhya Pradesh Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.కాగా ప్రమాద సమయంలో ట్రక్కుల్లో మొత్తం 60 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. లాక్‌డౌన్ నేపథ్యంలో వీరంతా మహారాష్ట్ర నుంచి స్వరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వెళ్తుండగా ప్రమాదం బారీన పడ్డారు.
వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Here's ANI Tweet
UP CM announces Rs 2 Lakh each ex-gratia to next of the kin of the workers from UP who died in a road accident in MP's Guna; compensation of Rs 50,000 each announced for critically injured. Officers asked to bring bodies of the deceased to their relatives & families in UP: UP CMO https://t.co/4AMD28IT5g pic.twitter.com/595o0U6ApO
— ANI (@ANI) May 14, 2020
ఇక మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ( Muzaffarnagar Accident) కాలినడకన తమ ఇళ్లకు తిరిగి వెళుతున్న కార్మికులను రోడ్‌వేస్ బస్సు ఢీకొంది. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ వలస కార్మికులంతా పంజాబ్‌లో పనిచేసేవారని, ఇప్పుడు బీహార్‌కు వెళ్తున్నారని తెలుస్తోంది.
ముజఫర్‌నగర్ పరిధిలోని సహరన్పూర్ రహదారి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనంచేసుకున్నారు. గాయపడిన కార్మికులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతి చెందిన వారిలో హరేక్ సింగ్(52), వికాస్(22), గుధ్(18),వాసుదేవ్(22), హరీష్ సహాని(42), వీరేంద్ర( 28)లు ఉన్నారు.