Parliament Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, 6 బిల్లులను ప్రవేశ పెట్టనున్న మోడీ సర్కార్,23న బడ్జెట్

ఇక ఈ సారి వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి.

Parliament sessions(ANI)

Delhi, July 19:  ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ సారి వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కగా విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు.

ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో ఆరు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 23న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ సారి సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులను పరిశీలిస్తే ఫైనాన్స్ బిల్లు, విపత్తు నిర్వహణ, బాయిలర్స్ బిల్లు, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లు, కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ బిల్లు, రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ బిల్లులు ఉన్నాయి.

అలాగే కేంద్ర బడ్జెట్‌, డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌పై చర్చపై ఓటింగ్ ఉండే అవకాశం ఉంది. వర్షాకాల సమావేశాలు జూలై 22 నుండి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన,ప్రవాస భారతీయులతో భేటీ

వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీఏసీని ఏర్పాటు చేశారు స్పీకర్ ఓం బిర్లా. ఈ కమిటీలో స్పీకర్‌తో సహా 15 మంది సభ్యులు ఉండనుండగా సభ్యులను స్పీకర్ నామినేట్ చేస్తారు. బీఏసీలోని సభ్యులను పరిశీలిస్తే ఓం బిర్లా - ఛైర్మన్, బీజేపీ నుండి పీపీ చౌదరి,నిషికాంత్ దూబే ,అనురాగ్ ఠాకూర్ ,సంజయ్ జైస్వాల్ ,

భర్తృహరి మహతాబ్,బైజయంత్ పాండా, కాంగ్రెస్ నుండి గౌరవ్ గొగోయ్,కొడికున్నిల్ సురేష్ , జేడీయూ నుండి దిలేశ్వర్ కమైత్,టీడీపీ నుండి లావు శ్రీకృష్ణ దేవరాయలు , తృణమూల్ కాంగ్రెస్ నుండి సుదీప్ బంద్యోపాధ్యాయ,డీఎంకే నుండి దయానిధి మారన్,శివసేన(యుబీటీ) నుండి అరవింద్ సావంత్,సమాజ్‌వాది పార్టీ నుండి లాల్జీ వర్మ అన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif