Hyd, Jul 19: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ఖరారైంది. ఆగస్టు 3న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు అమెరికాలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పర్యటన ఉండనుంది. డల్లాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పలు కంపెనీల సీఈవోలతో భేటీ కానున్నారు. తిరిగి ఆగస్టు 11న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.
అమెరికా పర్యటన సందర్భంగా పలు కంపెనీల సీఈవోలతో సమావేశం, ఎండోయూలు చేసుకోనున్నారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి.
న్యూయార్క్, డల్లాస్, శాన్ఫ్రాన్సిస్కో, న్యూ జెర్సీ ప్రాంతాల్లో పర్యటించనుండగా లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. ఇక అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ప్రవాస భారతీ యుల నుద్దేశించి ప్రసంగించనున్నారు. అమెరికా పర్యటన అనంతరం దక్షిణ కొరియా పర్యటనలో పర్యటించనున్నారు రేవంత్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి రెండో విదేశీ పర్యటన ఇది. రేవంత్ అమెరికా పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివాదంలో దర్శకుడు పూరి జగన్నాథ్, డబుల్ ఇస్మార్ట్‌లో కేసీఆర్ డైలాగ్, పోలీసులకు బోడుప్పల్ బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
రేవంత్ అమెరికా పర్యటన లోపే రెండో విడత రుణమాఫీ కూడా పూర్తి కానుంది. గురువారం 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.6098 కోట్లు జమచేశారు. దీంతో రైతులు పండగ చేసుకుంటున్నారు. ఇక రెండో విడతలో లక్షన్నరలోపు రుణమాఫీ ఈ నెలాఖరులోపు కానుంది. మూడో విడతలో 2 లక్షల రుణం తీసుకున్న వారికి ఆగస్టు 15లోపు డబ్బులు జమచేయనున్నారు.