Bihar: స్కూలులో బాలికపై అత్యాచారం, ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష విధించిన కోర్టు, సహకరించిన మరో ఉపాధ్యాయుడికి జీవిత ఖైదు అమలు, తీర్పు వెలువరించిన ప్రత్యేక పోక్సో కోర్టు

బీహార్ లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష ( School Principal and a Teacher Gets Death Sentence) విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి జీవిత ఖైదీగా అమలు చేస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.

School Principal and a Teacher Gets Death Sentence for Raping Class 5 Student (Photo-PTI)

Patna, Feb 16: అత్యాచారం కేసులో పాట్నా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీహార్ లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు స్కూల్‌ ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష ( School Principal and a Teacher Gets Death Sentence) విధించింది. అతనికి సహకరించిన మరో ఉపాధ్యాయుడికి జీవిత ఖైదీగా అమలు చేస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.

ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 11 సంవత్సరాల బాలిక 5వ తరగతి చదువుతోంది. ఆ పాఠశాలలో అరవింద్ కుమార్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా.. అభిషేక్ కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2018 సెప్టెంబర్‌లో ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్ తన స్కూళ్లో చదువుతున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ దారుణం చేయడానికి స్కూల్‌ టీచర్‌ అభిషేక్ కుమార్ కూడా సహకరించాడు.

కాగా కొన్ని రోజుల తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా.. బాలిక గర్భవతి అని తేలింది. దాంతో బాలిక తల్లి ఏం జరిగిందో చెప్పాలని తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను అరెస్ట్ చేశారు.

ఇంత ఘోరమా..అంబులెన్స్‌లోనే ఎస్ఐ ఆత్మహత్య, ఆస్పత్రిలో చేర్చుకోకపోవడమే కారణం, పోలీస్‌ వర్గాల్లో కలకలం రేపుతున్న ఘటన, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన ఢిల్లీ సౌత్ ఈస్ట్ డీసీపీ మీనా

ఆ కేసుకు సంబంధించి నేడు పాట్నా కోర్టు ప్రిన్సిపాల్‌కు మరణశిక్షను విధిస్తూ.. లక్ష రూపాయల జరిమానా కట్టాలని తీర్పు వెల్లడించింది. అదేవిధంగా ఆయనకు సహకరించిన ఉపాధ్యాయుడికి రూ. 50,000 జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది.

 



సంబంధిత వార్తలు

Mumbai Horror: అక్క గురించి గొప్పగా చెబుతుందనే కోపంతో తల్లిని కత్తితో పొడిచి చంపిన చెల్లి, అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితురాలు

RS Praveen Kumar: పోలీసుల ఆత్మహత్యలపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక సూచన, ఇలా చేస్తే ఆత్మహత్యలను ఆపవచ్చు..మానసిక ఒత్తిడిని అధిగించాలంటే ఇలా చేయండన్న ఆర్‌ఎస్పీ

New Year 2025: న్యూ ఇయర్‌ పార్టీ ఇన్విటేషన్‌లో కండోమ్‌లు, పూణెలో హై స్పిరిట్స్‌ పబ్‌ నిర్వాకం, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ

Nitish Kumar Reddy: సలామ్.. నితీశ్ కుమార్ రెడ్డి, ఆసీస్ గడ్డపై అదరహో..తెలుగు తేజానికి జేజేలు పడుతున్న క్రికెట్ ప్రపంచం..అసలు ఎవరి నితీశ్‌ రెడ్డి తెలుసా?