Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్, పాకిస్థాన్‌లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెబుతూ వీడియో సందేశం, ఓ చిన్నారి పాటను షేర్ చేసిన పవన్
ఓ చిన్నారి పాడిన పాటను షేర్ చేస్తూ దేశ విభజనకు సంబంధించి సంచలన ట్వీట్ చేశారు. పాకిస్థాన్ కు చెందిన హిందూ పిల్లల ఈ పాట విభజన యొక్క లోతైన బాధను ప్రతిబింబిస్తుంది. భారత్ తో మళ్లీ కలవాలని కోరుకునే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు పవన్.
Hyd, Oct 31: దీపావళి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్ చేశారు. ఓ చిన్నారి పాడిన పాటను షేర్ చేస్తూ దేశ విభజనకు సంబంధించి సంచలన ట్వీట్ చేశారు.
పాకిస్థాన్ కు చెందిన హిందూ పిల్లల ఈ పాట విభజన యొక్క లోతైన బాధను ప్రతిబింబిస్తుంది. భారత్ తో మళ్లీ కలవాలని కోరుకునే పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు పవన్. ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో ఆ శ్రీరాముడు మీకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. మీ భద్రత, స్థిరత్వం కోసం భారత్ లోని ప్రతిఒక్కరం ఎరుచూస్తున్నాం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. టీటీడీలో సమూల మార్పులు తీసుకొస్తాం, సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామన్న ఛైర్మన్ బీఆర్ నాయుడు, శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం నా అదృష్టం అని వెల్లడి
Here's Tweet:
పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో అణచివేతకు గురవుతున్న హిందువుల భద్రత, వారికి ప్రాథమిక హక్కులు కల్పించేందుకు యావత్ ప్రపంచం, ప్రపంచ నేతలు కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నా అని తెలిపారు. పవన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా పవన్‌కు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు.