Peera Garhi Rape Case: ఢిల్లీలో దారుణం, 12 ఏళ్ల బాలికను క్రూరంగా హింసిస్తూ రేప్ చేసిన కామాంధులు, ఒక నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సహాయం ప్రకటించిన ఢిల్లీ సీఎం
మంగళవారం 12ఏళ్ల బాలిక పై కొందమంది యువకులు హత్యాచారం (Peera Garhi Rape Case) చేసి దారుణంగా దాడిచేశారు. పశ్చిమ విహార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 100 సీసీటీవీ ఫుటేజీలను (100s of CCTV footage) పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
New Delhi, August 6: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి నిర్భయ లాంటి ఘటనకు వేదికగా మారింది. మంగళవారం 12ఏళ్ల బాలిక పై కొందమంది యువకులు హత్యాచారం (Peera Garhi Rape Case) చేసి దారుణంగా దాడిచేశారు. పశ్చిమ విహార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 100 సీసీటీవీ ఫుటేజీలను (100s of CCTV footage) పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
ఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్ షాలిని సింగ్ (Joint Commissioner of Delhi Police Shalini Singh) ఒక ప్రకటనలో, “100 సిసిటివి ఫుటేజ్లను స్కాన్ చేసి, అనుమానితులను ప్రశ్నించిన తరువాత, 33 ఏళ్ల వ్యక్తిని మేము అరెస్టు చేసాము. అతని పేరు క్రిషన్ అని తెలిపారు. అతనిపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాటిలో ఒకటి హత్య కేసు కూడా ఉందని తెలిపారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి మరియు అపరాధిని పట్టుకోవడానికి ఇరవై బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఆమె కోలుకుంటుందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాత్సవ (Delhi Police Commissioner S.N. Shrivastava) కూడా మీడియాకు తెలిపారు. తండ్రి, తాతే కామాంధులు అయ్యారు, తమిళనాడులో బాలికపై అత్యాచారం, ఇద్దరూ పోక్సో చట్టం కింద అరెస్ట్, బాలిక ప్రెగ్నెన్సీని తొలగించడానికి కోర్టు అనుమతి
ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురై ఏయిమ్స్ ఆసుపత్రిలో (All India Institute of Medical Sciences (AIIMS) మృత్యువుతో పోరాడుతున్న 12 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులను గురువారం కేజ్రివాల్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడినట్టు తెలిపారు. ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల సహాయాన్ని ప్రకటించారు. బాలికకు వైద్యం అందిస్తున్న డాక్టర్లతో కేజ్రివాల్ చర్చించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని, మరో 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు.
Here's Delhi CM Arvind Kejriwal Tweet
గురువారం ఎయిమ్స్‌లో బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఢిల్లీ సీఎం మాట్లాడుతూ.. ‘బాధితురాలు ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది’’ అని వివరించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. నిందితుడిని గుర్తించి, వెంటనే అరెస్టు చేయాలని.. కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయసాయం అందిస్తామని, సీనియర్ లాయర్లను నియమించి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ కూడా ఎయిమ్స్‌ను సందర్శించారు. పోలీసు దర్యాప్తులో ఆలస్యంపై ఆమె మండిపడ్డారు. బాధితురాలి ఒంటిపై ప్రతిచోటా రక్తపు గాయాలున్నాయని ఆమె విలేకరులకు తెలిపారు. ఫ్రీ వైఫైతో 80 వేల పోర్న్ చిత్రాలను డౌన్‌లోడ్ చేసింది, ఆస్పత్రి బెడ్ మీద నుంచే వీడియోలు చూసింది, యూకేలో పోలీసులకు షాకిచ్చిన ఘటనపై ఓ లుక్కేయండి
అసలేం జరిగింది ?
ఢిల్లీలోని పశ్చిమ విహార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ 12 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. తల్లిదండ్రులు, ఆమె సోదరి, స్థానికంగా ఉన్న గార్మెంట్ షాపులో పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం బాలిక తల్లిదండ్రులు, సోదరి పనికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. ఆమెపై అత్యాచారం చేసి, శరీరమంతా కత్తులతో పొడిచి వికృతానందం (Horrific Rape Incident) పొందారు. అదే రోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో అతి కష్టంతో బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చింది. పొరుగింటి వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని తొలుత సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించాగా, అక్కడి డాక్టర్ల సూచనల మేరకు ఎయిమ్స్‌కు తరలించారు. ఆమె తలకు బలమైన గాయమైనట్లు వైద్యులు తెలిపారు. శరీరమంతా కత్తిపోట్లు ఉండడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశారు.