Pegasus Row: పెగాస‌స్ కేసులో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు, ప‌దిరోజుల్లో దీనిపై నివేదిక అందజేయాలని ఆదేశాలు, వీటిపై బ‌హిరంగంగా చ‌ర్చించ‌లేమ‌ని కోర్టుకు నివేదించిన తుషార్ మెహ‌తా

ప‌దిరోజుల్లోగా దీనిపై స‌వివ‌రంగా బ‌దులివ్వాల‌ని కేంద్రాన్ని కోరింది. తదుపరి విచారణ 10రోజులకు వాయిదా వేసింది.

Supreme Court | (Photo Credits: PTI)

New Delhi, Aug 17: పెగాస‌స్ స్పైవేర్ ద్వారా ప్ర‌భుత్వం ఫోన్ హ్యాకింగ్‌కు పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌ల‌పై కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ద‌ర్యాప్తు చేపట్టాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం కేంద్ర ప్ర‌భుత్వానికి నోటీసులు (Supreme Court Issues Notice to Centre) జారీ చేసింది. ప‌దిరోజుల్లోగా దీనిపై స‌వివ‌రంగా బ‌దులివ్వాల‌ని కేంద్రాన్ని కోరింది. తదుపరి విచారణ 10రోజులకు వాయిదా వేసింది.

జాతీయ భ‌ద్ర‌త‌పై ఏ ఒక్క‌రూ రాజీప‌డాల‌ని కోరుకోరని కొంద‌రు ప్రముఖ వ్య‌క్తులు ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని..అయితే సంబంధిత యంత్రాంగం అనుమ‌తితోనే ఇలా చేయాల్సి ఉంటుంద‌ని ఆ అథారిటీ కోర్టు ఎదుట అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌డానికి స‌మ‌స్య ఏముందుని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది.

పెగాస‌స్ (Pegasus) వ్య‌వ‌హారంలో కోర్టు ముందు దాప‌రికంతో వ్య‌వ‌హ‌రించాల‌ని కేంద్రం కోరుకోవ‌డం లేద‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా పేర్కొన్నారు. ఇది జాతీయ భ‌ద్ర‌త‌కు సంబంధించిన అంశ‌మ‌ని, ఈ సాఫ్ట్‌వేర్‌ను అన్ని దేశాలు కొనుగోలు చేశాయ‌ని ఈ సాఫ్ట్‌వేర్ తాము వాడుతుంటే ఆ వివ‌రాలు వెల్ల‌డించాల‌ని పిటిష‌నర్లు కోరుతున్నార‌ని, తాము అలా చేస్తే ఉగ్ర‌వాదులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

చర్చలేకుండా ఎలా ఆమోందించారు, ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లు ఆర్డినెన్స్ కొట్టివేసినా బిల్లులోకి ఎలా చేర్చారని కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లకు నియామకాలు 10 రోజుల్లో చేపట్టాలని ఆదేశం

నిపుణుల క‌మిటీ ఈ అంశాల‌ను ప‌రిశీలిస్తోంద‌ని, వీటిపై బ‌హిరంగంగా చ‌ర్చించ‌లేమ‌ని తుషార్ మెహ‌తా కోర్టుకు నివేదించారు. నిపుణుల క‌మిటీ త‌న నివేదిక‌ను కోర్టుకు అంద‌చేస్తుంద‌ని, కానీ ఈ అంశాల‌ను తాము ఎలా సంచ‌ల‌నాత్మ‌కం చేయ‌గ‌ల‌మ‌ని ఆయ‌న వాదించారు. పెగాసస్‌ ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతిపక్షాలు, జర్నలిస్టుల ఆరోపణలను ​కేంద్రం కొట్టిపారేసింది. కాగా పెగాసస్‌పై నిజాలను నిగ్గు తేల్చేందుకు ట్రిబ్యునట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తెలిపిన సంగతి తెలిసిందే.