Satya Nadella: వర్క్ ఫ్రం హోం చాలా డేంజర్, మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించే అవకాశం, కీలక వ్యాఖ్యలు చేసిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్ల

అన్ని కంపెనీలు ఉద్యోగులను మూడు నెలల నుంచి ఇంటి నుంచే పని (work from home) చేయమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్ల (Microsoft CEO Satya Nadella) కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా ఉద్యోగుల చేత వర్క్ ఫ్రం హోం చేయించడం(ఇంటి నుంచే ఆఫీసు పని చేయడం) వారి మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించే అవకాశం (damaging for workers) ఉందని, వారి సామాజిక బంధాలు దెబ్బతినొచ్చని అభ్రిప్రాయపడ్డారు.

Microsoft CEO Satya Nadella Salary Increased By 66 Percent (Photo-Getty)

San Francisco, May 19: దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో అందరూ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. అన్ని కంపెనీలు ఉద్యోగులను మూడు నెలల నుంచి ఇంటి నుంచే పని (work from home) చేయమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్ల (Microsoft CEO Satya Nadella) కీలక వ్యాఖ్యలు చేశారు. శాశ్వతంగా ఉద్యోగుల చేత వర్క్ ఫ్రం హోం చేయించడం(ఇంటి నుంచే ఆఫీసు పని చేయడం) వారి మానసిక ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించే అవకాశం (damaging for workers) ఉందని, వారి సామాజిక బంధాలు దెబ్బతినొచ్చని అభ్రిప్రాయపడ్డారు. ఫాస్టాగ్‌ లేకుంటే డబుల్‌ టోల్‌ ఫీజు, ఆదేశాలు జారీ చేసిన రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, దేశవ్యాప్తంగా 1.68 కోట్ల ఫాస్టాగ్‌లను మంజూరు చేసిన ప్రభుత్వం

ఓ అమెరికా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా సత్యా.. ఉద్యోగుల మానసిక స్థితి ఎలా ఉండబోతోంది? వారి మానసికంగా అలసిపోతే ఎలా.. అనే ప్రశ్నలను లేవనెత్తారు. ‘సామాజిక బంధాల ద్వారా మనం సాధించకున్న మంచినంతా ఇలా వర్క్ ఫ్రం హోం ద్వారా కోల్పోయే అవకాశం ఉంది’ అని అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారి అంతమొందే వరకూ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయించాలని ట్విటర్ భావిస్తున్న నేపథ్యంలో సత్యా నాదెళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఫేస్బుక్, ఆల్ఫాబెట్ (గూగుల్) మరియు ఇతరులు తమ ఉద్యోగులను ఇంటి నుండి సంవత్సరం చివరి వరకు పని చేయమని కోరిన తరువాత ట్విట్టర్ కూడా ముందుకొచ్చింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఇంటి నుండి పని చేసే విధానాన్ని కనీసం అక్టోబర్ వరకు పొడిగించింది. టెక్ దిగ్గజం స్టాక్ ధర ఈ సంవత్సరం 14 శాతం పెరిగింది మరియు కంపెనీకి దాదాపు 140 బిలియన్ డాలర్ల నగదు ఉంది.

COVID-19 సంక్షోభం మధ్య భారతీయ చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు (SMB లు) వ్యాపార కొనసాగింపును కొనసాగించడానికి మరియు వారి క్లౌడ్ స్వీకరణ ప్రయాణాలను ప్రారంభించడానికి కంపెనీ కొత్త పరిష్కారాలను ప్రారంభించింది.