Punjab: పంది పిల్లల వ్యాపారమంటూ కోట్లకు కుచ్చు టోపీ పెట్టిన మోసగాడు, ఢిల్లీతోపాటు పంజాబ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కేసులు
పంది పిల్లల వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించవచ్చంటూ ఓ వ్యక్తి జనాలకు రూ.వందల కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు.పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌కు చెందిన మంగత్ రాం మైనీ అనే వ్యక్తి అధిక రాబడుల పేరుతో భారీ మొత్తాలు వసూలు చేసి మోసగించాడు.
Punjab, Nov 21: పంది పిల్లల వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించవచ్చంటూ ఓ వ్యక్తి జనాలకు రూ.వందల కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు.పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌కు చెందిన మంగత్ రాం మైనీ అనే వ్యక్తి అధిక రాబడుల పేరుతో భారీ మొత్తాలు వసూలు చేసి మోసగించాడు.
రూ. 10,000 విలువైన 3 పంది పిల్లలను కొనుగోలు చేసి పెంచితే.. విదేశాల్లో వాటి మాంసానికి ఉన్న గిరాకీతో ఏడు నెలల్లోనే రూ.40,000 వస్తాయంటూ నమ్మబలికాడు. ఏడు నెలలు కాగానే రూ.15,000 ఇస్తానని, మిగిలిన రూ.25,000 వారానికి రూ.500 చొప్పున 30 వారాలపాటు చెల్లిస్తానని ప్రచారం చేసుకున్నాడు. దీనికి ఆకర్షితులై పలువురు రూ.10,000 నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు.
దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసి, కొన్ని వారాలపాటు బాగానే చెల్లించిన మైనీ.. తర్వాత బోర్డు తిరగేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ మోసంపై ఢిల్లీతోపాటు పంజాబ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి.