Telangana Rising delegation meets Singapore Minister Grace Fu Haiyin(CMO X)

Delhi, Jan 18:  సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైయిన్‌తో భేటీ అయింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం. వివిధ రంగాలలో తెలంగాణతో సింగపూర్​ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు జరిపారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి.

నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, స్పోర్ట్స్, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాలలో అనుకూలతలపై భేటీలో చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు సింగపూర్ మంత్రి గ్రేస్ పు హైయిన్. తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో భాగంగా భాగస్వామ్యం పంచుకోవాలనే ప్రభుత్వ ఆహ్వానాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సింగపూర్‌ ఐటీఈతో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం,గ్రీన్ ఎనర్జీపై ఫోకస్

ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణాళిలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు - నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వ, సాంకేతికత సహా వివిధ రంగాలలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి.

ఈ చర్చల్లో ముఖ్యమంత్రి వెంట ఐటీ & పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు, సింగపూర్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్ పూజ పాల్గొన్నారు.

#TelanganaRising లక్ష్యాలు, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం అనురిస్తున్న కార్యాచరణ పట్ల సింగపూర్ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ ఆసక్తి కనబరిచారు. ప్రధానంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టులపై సాధ్యమైనంత వేగంగా ముందుకు పోవాలని, మరింత సమన్వయంతో పని కలిసి చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.