Plasma Therapy Dropped: ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం, కరోనా చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు, రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమ్యాబ్‌లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి

దానివల్ల ఎలాంటి ఫలితం లేదని వివిధ అధ్యయనాల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమ్యాబ్‌లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది.

ICMR | Representative Image

New Delhi, May 18: కరోనా రోగులకు అందించే చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తూ (Plasma Therapy Dropped) ఐసీఎంఆర్‌ సోమవారం రాత్రి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దానివల్ల ఎలాంటి ఫలితం లేదని వివిధ అధ్యయనాల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమ్యాబ్‌లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది.

ఎయిమ్స్‌/ఐసీఎంఆర్‌ కొవిడ్‌-19 నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌, జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌లో తీసుకున్న నిర్ణయంలో భాగంగా సవరించిన మార్గదర్శకాలను ఐసీఎంఆర్ (Indian Council of Medical Research) సోమవారం విడుదల చేసింది.కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీ (Plasma Therapy) నిరోధించలేకపోతోందని, మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

39 ట్రయల్ సెంటర్లలో 464 కొవిడ్ రోగులపై నిర్వహించిన ICMR అధ్యయనం ప్లాస్మా థెరపీ మరణాల రేటును తగ్గించడం లేదని తేలింది. కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే (వారి రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేస్తారు) దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. దీంట్లో ఉంటే యాంటీబాడీలు కరోనా వైరస్‌పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా, వ్యాధి తీవ్రత అంతగా లేనపుడు ప్లాస్మా థెరపీని వాడటానికి గతంలో అనుమతించారు.

సెకండ్ వేవ్ ముగిసినట్లేనా..దేశంలో తగ్గుతున్న కేసులు,పెరుగుతున్న డిశ్చార్జ్ రేటు, తాజాగా 4,22,436 మంది కోలుకుని డిశ్చార్జ్, నిన్న‌ కొత్త‌గా 2,63,533 మందికి కరోనా నిర్ధారణ, 4,329 మంది కోవిడ్ కారణంగా మృతి

అశాస్త్రీయంగా, అహేతుకంగా ప్లాస్మా థెరపీని విచ్చలవిడిగా వాడుతున్నారని, దీనివల్ల కలిగే ప్రయోజనాలకు సరైనా ఆధారాలు లేవని కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ప్లాస్మా థెరపీతో ప్రమాదకరమైన కొత్త వేరియెంట్లు పుట్టుకొచ్చే అవకాశముందని హెచ్చరిస్తూ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్, ఐసీఎంఆర్‌ చీఫ్‌ భార్గవ, ఎయిమ్స్‌ డైరెక్టర్‌కు లేఖలు రాశారు. 18 మంది వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణుల బృందం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్లాస్మా థెరపీ కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్ అయిన సార్స్-కోవ్ -2 వైరస్ జాతుల అవకాశాన్ని పెంచుతుందని ఆరోపిస్తూ లేఖలో తెలిపింది.

పద్మశ్రీ డాక్టర్ కెకె అగర్వాల్ కరోనాతో కన్నుమూత, కార్డియాలజిస్ట్ గా విశిష్ట సేవలందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు

ప్లాస్మా చికిత్సపై దేశంలో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు శాస్త్రీయంగా లేవని వాదించడానికి, ఐసిఎంఆర్-ప్లాసిడ్ ట్రయల్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన రికవరీ ట్రయల్, అర్జెంటీనా ప్లాస్మ్ఆర్ ట్రయల్ అనే మూడు అధ్యయనాలను నిపుణులు తమ లేఖలో ఉదహరించారు. కొవిడ్ -19 చికిత్స కోసం ప్లాస్మా అందించినా ప్రయోజనం లేదని ప్రస్తుత పరిశోధన ఆధారాలు ఏకగ్రీవంగా సూచిస్తున్నాయి. ఐసిఎంఆర్ / ఎయిమ్స్ జారీ చేసిన మార్గదర్శకాల వల్ల ప్రస్తుతం ప్లాస్మా థెరపీని (ఏప్రిల్ 2021 వెర్షన్) ‘ఆఫ్ లేబుల్’ వాడకంగా సిఫారసు చేస్తున్నందున సమస్యలు ఎదురవుతున్నాయని బృందం పేర్కొంది.

Here's ANI Update

ఇది చాలా అసాధారణమైనదని, ఆఫ్-లేబుల్ వాడకం అంటే ‘ఆమోదించబడని ఉపయోగం’ అని సూచిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన భారత వైద్య పరిశోధన మండలి– కోవిడ్‌ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ప్లాస్మా థెరపీని చికిత్సా విధానం నుంచి తప్పించాలని సభ్యులందరూ అభిప్రాయపడ్డారు.

ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి

ప్లాస్మా అనేది రక్తంలో ఉండే ద్రవ భాగం. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఆరోగ్యకరమైన శరీరంలో 55 శాతానికి పైగా ప్లాస్మా ఉంటుంది. ఇందులో నీటితో పాటు హార్మోన్లు, ప్రోటీన్, కార్బన్ డయాక్సైడ్, గ్లూకోజ్ ఖనిజాలు ఉంటాయి. కరోనావైరస్ నుండి రోగి కోలుకున్నప్పుడు, అదే ప్లాస్మాను కరోనావైరస్ బాధితుడికి అందిస్తారు. దీనిని ప్లాస్మా థెరపీ అంటారు.

కరోనావైరస్ నుండి నయమైన రోగి యొక్క రక్త ప్లాస్మాను అనారోగ్య రోగికి అందిస్తే, అప్పుడు నయమైన రోగి యొక్క ప్రతిరోధకాలు అనారోగ్య వ్యక్తి యొక్క శరీరానికి బదిలీ చేయబడతాయి. వారు వైరస్ తో పోరాడటం ప్రారంభిస్తారని నమ్ముతారు. వైరస్ శరీరాన్ని తీవ్రంగా తాకినప్పుడు, అదేవిధంగా ఆ శరీరంలో ప్రతిరోధకాలు ఏర్పడలేనప్పుడు, ప్లాస్మా థెరపీ అటువంటి సమయంలో పనిచేస్తుందని చాలా మంది వైద్యులు నమ్ముతారు. దీంతో బ్లడ్ ప్లాస్మాకు చాలా డిమాండ్ ఉంది.