దేశంలో ఎంతో పేరుపొందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ కెకె అగర్వాల్ (62) కరోనాతో కన్నుమూశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) మాజీ అధ్యక్షుడు డా. కె.కె.అగర్వాల్(62) ఇటీవల కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స కోసం కె.కె.అగర్వాల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
డాక్టర్ అగర్వాల్ హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు హెడ్‌గా పని చేసి.. కార్డియాలజిస్ట్‌గా సేవలు అందించారు. ఆయన 2005లో డాక్టర్ బీసీ రాయ్ అవార్డు, 2010లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. రెండు రోజుల క్రితం డాక్టర్ అగర్వాల్ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. డాక్టర్ కెకె అగర్వాల్ ఆరోగ్యం గురించి వివిధ రకాల వదంతులు వస్తున్నాయని వాటిని నమ్మవద్దని వారు దానిలో పేర్కొన్నారు. డాక్టర్ కేకే అగర్వాల్ భార్య కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
— Dr K K Aggarwal (@DrKKAggarwal) May 17, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)