Plastic Whistle Inside Lungs: నోరు తెరిస్తే విజిల్ సౌండ్, ప్లాస్టిక్ విజిల్ మింగిన కుర్రాడు, 11 నెలల పాటూ నరకయాతన

అలాగని అతనేమీ డ్రిల్ మాస్టర్ కాదు. కేవలం 12 ఏళ్ల కుర్రాడు. ఓ రోజు ఆడుకుంటూ ప్లాస్టిక్(Whistle) విజిల్ మింగిన ఓ కుర్రాడు, దాదాపు 11 నెలల పాటూ ఆ విషయాన్ని దాచాడు. దీంతో అతను గట్టిగా మాట్లాడితే విజిల్(Whistle) శబ్దం వినిపించేది.

Kolkata November 26: అతను నోరు తెరిస్తే విజిల్(Whistle) శబ్దం వినిపించేది. అలాగని అతనేమీ డ్రిల్ మాస్టర్ కాదు. కేవలం 12 ఏళ్ల కుర్రాడు. ఓ రోజు ఆడుకుంటూ ప్లాస్టిక్(Whistle) విజిల్ మింగిన ఓ కుర్రాడు, దాదాపు 11 నెలల పాటూ ఆ విషయాన్ని దాచాడు. దీంతో అతను గట్టిగా మాట్లాడితే విజిల్(Whistle) శబ్దం వినిపించేది. ఊపిరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడేవాడు. దీంతో అతని బాధను గమనించిన తల్లిదండ్రులు పదుల కొద్దీ ఆస్పత్రులు తిరిగారు. విజిల్ మింగిన సంగతి తల్లిదండ్రులకు చెప్తే కొడతారనే భయంతో జరిగిన దాని గురించి ఆ పిల్లాడు కూడా వారికి చెప్పలేదు.

పశ్చిమ బెంగాల్‌(West Bengal) దక్షిణ 24 పరగణాల జిల్లా బరుయిపూర్‌ ప్రాంతానికి చెందిన రైహాన్‌ లస్కర్‌(12) అనే కుర్రాడు 2021, జనవరి(January)లో విజిల్‌తో ఆడుతూ.. చిప్స్‌ తింటున్నాడు. ఈ క్రమంలో అనుకోకుండా చేతిలో ఉన్న విజిల్‌ని మింగేశాడు. బయటకు ఉద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక దీని గురించి తల్లిదండ్రులకు చెప్తే.. కొడతారనే భయంతో సైలెంట్‌గా ఉన్నాడు. దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు ఏవో మందులు రాసే వారు కానీ అసలు సమస్య ఏంటో చెప్పలేకపోయారు. ఇలా ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకపోగా.. రోజురోజుకి రైహాన్‌ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది.

ఈ క్రమంలో ఓ వైద్యుడి సూచన మేరకు కుమారుడిని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడ రైహాన్‌ పరిస్థితిని గమనించిన సీనియర్‌ వైద్యులు అతడికి ఎక్స్‌రే తీసి.. ఊపిరితిత్తుల(Lungs) మధ్య ఇరుక్కున్న విజిల్‌ని గుర్తించారు. అనంతరం వైద్యులు రైహాన్‌కు ఆపరేషన్‌ చేసి విజిల్‌ని తొలగించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif