PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్‌స్టాల్‌మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే

పీఎం కిసాన్ (PM Kisan) 20వ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 19వ విడత డబ్బుల పంపిణీ తర్వాత రైతుల చూపు ఇప్పుడు 20వ విడతపైనా పడింది. పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రభుత్వం సకాలంలో రైతులకు చెల్లింపులు చేస్తుంది.

PM Kisan 20th Installment Date 2025... Check Beneficiary List, Here are the details!(google photos)

New Delhi, March 06: పీఎం కిసాన్ (PM Kisan) 20వ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 19వ విడత డబ్బుల పంపిణీ తర్వాత రైతుల చూపు ఇప్పుడు 20వ విడతపైనా పడింది. పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రభుత్వం సకాలంలో రైతులకు చెల్లింపులు చేస్తుంది. కానీ, రైతులు డబ్బుల పంపిణీ ఆలస్యం కాకుండా ఉండాలంటే eKYCని పూర్తి చేయాలి. మీ భూమి రికార్డులను అప్‌డేట్ చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను లింక్ చేయాలి. మీరు ఇంకా మీ వాయిదాల స్టేటస్ చెక్ చేయకపోతే, ఈరోజే (pmkisan.gov.in)ని విజిట్ చేయండి.

చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా భారత ప్రభుత్వం ఫిబ్రవరి 2019లో పీఎం కిసాన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం సంవత్సరానికి రూ. 6వేలు అందిస్తుంది. మూడు వాయిదాలలో రూ. 2వేలు చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జమ అవుతుంది.

RBI To Tighten Gold Loan Processes: బంగారం రుణాలు తీసుకోవడం ఇక అంత సులభమేమీ కాదు! గోల్డ్‌ లోన్ విషయంలో నిబంధనలను కఠినతరం చేయనున్న ఆర్బీఐ 

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద మూడు వాయిదాల్లో డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.

మొదటి విడత : ఏప్రిల్ – జూలై

రెండో విడత : ఆగస్టు – నవంబర్

మూడో విడత : డిసెంబర్ – మార్చి

19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది. 20వ విడత జూన్ 2025 నాటికి జమ అవుతుందని భావిస్తున్నారు. మీకు పీఎం కిసాన్ డబ్బులు సకాలంలో అందాలంటే రైతులు eKYC వెరిఫికేషన్, ఆధార్ లింకింగ్, భూమి రికార్డులకు సంబంధించి వివరాలను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

పీఎం కిసాన్ 20వ వాయిదా స్టేటస్ చెక్ చేయాలి? :

మీరు మీ పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ సులభంగా చెక్ చేయవచ్చు.

అధికారిక వెబ్‌సైట్‌ (pmkisan.gov.in)ని విజిట్ చేయండి.

‘Beneficiary Status’పై క్లిక్ చేయండి. హోమ్‌పేజీలో ఆప్షన్ కనిపిస్తుంది.

అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.

మీ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించండి.

స్టేటస్ చెక్ చేయండి.. 20వ వాయిదా కోసం ‘Get Data’పై క్లిక్ చేయండి.

Tamilisai Soundararajan Arrest: చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ అరెస్ట్, NEPపై అనుమతి లేకుండా ప్రజా సంతకాల ప్రచారాన్ని నిర్వహించినందుకు అదుపులోకి తీసుకున్న పోలీసులు  

అర్హత ప్రమాణాలివే :

పీఎం కిసాన్ 20వ విడత కోసం ఈ కింది అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి.

మీరు చిన్న లేదా సన్నకారు రైతు అయి ఉండాలి.

మీకు సాగు భూమి ఉండాలి.

మీ భూమి రికార్డులను రాష్ట్ర ప్రభుత్వంతో అప్‌డేట్ చేయాలి.

మీరు eKYC వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి.

మీ ఆధార్ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి.

ఎవరు అర్హులు కాదంటే? :

సంస్థాగత భూస్వాములు

ప్రభుత్వ ఉద్యోగులు (గ్రూప్ డీ, క్లాస్ IV ఉద్యోగులు తప్ప)

గత అంచనా సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు

వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు

పీఎం కిసాన్ eKYC ఎలా పూర్తి చేయాలి? :

20వ విడత అందుకోవడానికి eKYC ప్రక్రియ తప్పనిసరి.

మీ eKYC పూర్తి చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.

పీఎం కిసాన్ పోర్టల్ (pmkisan.gov.in)కి వెళ్లండి.

హోమ్‌పేజీలో ‘eKYC’పై క్లిక్ చేయండి.

మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి OTPతో ధృవీకరించండి.

వెరిఫై పూర్తి అయ్యాక eKYC పూర్తవుతుంది.

బయోమెట్రిక్ eKYC కోసం దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని విజిట్ చేయొచ్చు.

Read Also : LIC Scheme : ఎల్ఐసీలో అదిరే స్కీమ్.. రోజుకు కేవలం రూ. 200 డిపాజిట్ చేస్తే.. రూ. 20 లక్షలు మీ సొంతం..!

కొత్త రైతులు ఎలా రిజిస్టర్ చేయాలంటే? :

కొత్త రైతులు పీఎం కిసాన్ పథకం కింద ఇంకా రిజిస్టర్ చేసుకోవాలంటే..

అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌ (pmkisan.gov.in)కి వెళ్లండి.

‘New Farmer Registration’పై క్లిక్ చేయండి.

మీ ఆధార్ నంబర్, అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.

భూమి యాజమాన్య పత్రాలను అప్‌లోడ్ చేయండి.

ఫారమ్‌ను సబ్మిట్ చేసి వెరిఫికేషన్ కోసం వేచి ఉండండి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement