IPL Auction 2025 Live

PM Modi on Interim Budget 2024: ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని తెలిపిన ప్రధాని మోదీ, యువత ఆకాంక్షలను మధ్యంతర బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్న భారత ప్రధాని

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత 2024 మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi on Interim Budget 2024) తన అభిప్రాయాలను పంచుకున్నారు.మార్చి-ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం దేశం ఎదురుచూస్తుండగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ చివరిది.

PM Narendra Modi on Interim Budget 2024. (Photo credits: LatestLY)

New Delhi, Feb1: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత 2024 మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi on Interim Budget 2024) తన అభిప్రాయాలను పంచుకున్నారు.మార్చి-ఏప్రిల్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం దేశం ఎదురుచూస్తుండగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ చివరిది. మధ్యంతర బడ్జెట్‌పై తన ప్రసంగంలో, FM నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ లోతైన సానుకూల పరివర్తనను చూసిందని తెలిపారు.

దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. వికసిత్ భారత్‌కు మూలస్తంభాలైన పేదలు, యువత, మహిళలు, అన్నదాతల సాధికారతకు ఈ బడ్జెట్ కృషి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అని కొనియాడారు. ద్రవ్యలోటును అదుపులో ఉంచుతూనే మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లకు చేరుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు.

ఆర్థిక బిల్లు 2024కు లోక్‌సభ ఆమోదం, కేంద్ర బడ్జెట్ సమావేశాలు రేపటికి వాయిదా, కేంద్ర మధ్యంతర బడ్జెట్ పూర్తి అప్ డేట్స్ ఇవిగో..

ఈ బడ్జెట్ నిర్ణయాలు 21వ శతాబ్దపు అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా యువతకు ఎన్నో కొత్త కొత్త ఉపాధి అవకాశాల కల్పనకు దారితీస్తాయని పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ఈ దిశగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ. 1 లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేయడం, స్టార్టప్‌లకు పన్ను మినహాయింపును పెంచడం జరిగిందన్నారు