IPL Auction 2025 Live

PM Modi's Independence Day Speech: ఏకధాటిగా 90 నిమిషాల పాటు ప్రసంగించి ప్రధాని మోదీ సరికొత్త రికార్డు, భారత ప్రధాని స్పీచ్ హైలట్స్ ఇవిగో

మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు.

PM Modi (Photo-PTI)

New Delhi, August 15: స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా చారిత్రక ఎర్రకోట (Red Fort) నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోదీ (PM Modi) నిలిచారు. మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు.

90 నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడిన ఆయన.. పంద్రాగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు 10 సార్లు మోదీ ప్రసంగించగా.. సగటు సమయం 82 నిమిషాలుగా ఉంది. దేశ చరిత్రలో ఇతర ప్రధానులు మాట్లాడిన సగటు ప్రసంగ సమయం కంటే ఇది ఎక్కువ కావడం విశేషం. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక అతిథులు ఈ సభలో పాల్గొన్నారు.

భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ..దేశ ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మొదటగా మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ దేశం మణిపూర్‌ ప్రజలకు అండగా ఉంటుందన్నారు.

ఈశాన్య రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ దేశం స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు. వారందరి త్యాగఫలమే ఈ స్వాతంత్య్రం. ఈ సందర్బంగా ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని గడిచిన పదేళ్లలో భారత్‌ ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందన్నారు.

ఈ పదేళ్లలో భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. శాటిలైట్‌ రంగంలో దూసుకుపోతున్నాం, రాబోయే కాలాన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాసిస్తోంది. 30 ఏళ్ల లోపు యువతే భారత్‌కు దిశానిర్దేశం చేయాలి. సాంకేతికంగానే కాదు వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందుతోందని అన్నారు. నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలమని భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు.

డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు అంశాలు భారత దేశానికి ఎంతో ముఖ్యమైనవి. టెక్నాలజీ విషయంలో భారత్‌ ఎంతో మెరుగుపడి డిజిటల్‌ ఇండియా దిశగా భారత్‌ దూసుకెళ్తోన్నట్లు తెలిపారు. క్రీడా రంగంలో సైతం యువత ప్రపంచ పాఠం మీద తన సత్తా చాటుతోంది. అలాగే సాంకేతికంగా స్టార్టప్స్‌ రంగంలో భారత్‌ టాప్‌-3లో ఉంది. ఇక ఈ ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక జీ-20 సమావేశానికి ఆతిధ్యమిచే అరుదైన అవకాశం భారత్‌కు లభించిందని అన్నారు.

మేనిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామని తెలిపిన సీఎం జగన్, పేదలు గెలిచి వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం జరుగుతుందని వెల్లడి

కేవలం అవినీతి రాక్షసి వలననే దేశం వెనక్కు వెళ్లిందని అందుకే ప్రజలు సుస్థిరమైన అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని.. పీఎం సహాయనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సైన్యంలో వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌ అమలు చేస్తూ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నామని దేశ ఆర్థిక వ్యవస్త బాగుంటేనే దేశం బాగుంటుందని రూ. 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించామని రూ. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చినట్లు తెలిపారు.

కరోనా లాంటి అక్షిత సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత దేశం దిక్సూచిగా మారింది. కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం ప్రపంచాన్ని మార్చడంలో భారత్‌ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని అన్నారు.

గోల్కొండ కోట‌ నుంచి ప్రజలకు వరాల జల్లులు కురిపించిన సీఎం కేసీఆర్, జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి

భిన్నత్వంలో ఏకత్వమే భారత్‌ బలమని ప్రతి నిర్ణయంలో దేశ ప్రగతికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకురావడంతో అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోందన్నారు. ఇక వైద్య రంగానికి వస్తే జన ఔషధితో ప్రజలందరికీ చౌకగా మందులు అందజేస్తున్నామని, అందుకు వీలుగా జన ఔషధి కేంద్రాల సంఖ్య 10 వేల నుంచి 25 వేలకు పెంచామన్నారు. జన్‌ధన్‌ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపామని తెలిపారు.

మారుమూల గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించామన్నారు. దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్‌ను అందుబాలోకి తీసుకువచ్చామని వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత దేశమే ఉంటుందని భారత్‌ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.

పట్టణాలు, నగరాల్లో తమకు ఓ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటున్నవారి కోసం తన ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెడుతోందన్నారు. నగరాల్లో నివసిస్తూ, సొంత ఇల్లు లేని మధ్య తరగతి ప్రజలకు బ్యాంకు రుణాల్లో ఉపశమనం కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

తాను 2014లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టేనాటికి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల్లో 10వ స్థానంలో ఉండేదని, నేడు అది ఐదో స్థానానికి వృద్ధి చెందిందని, రానున్న ఐదేళ్లలో ఇది ప్రపంచంలోని మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నందు వల్ల ప్రజలపై ధరల భారం అతి తక్కువగా ఉండేలా చూడటం కోసం మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడంలో తన ప్రభుత్వం కొంత వరకు విజయం సాధించిందని చెప్పారు. ఈ కృషి కొనసాగుతుందన్నారు.

మహిళా స్వయం సహాయక బృందాల కృషిని మోదీ ప్రశంసించారు. రెండు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేయాలనేది తన కల అని చెప్పారు. నేడు మహిళా స్వయం సహాయక బృందాల్లో 10 కోట్ల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి జరిగితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. పౌర విమానయాన రంగంలో మహిళా పైలట్లు ఉన్నారని, మహిళలు శాస్త్రవేత్తలు అవుతున్నారని చెప్పడం గర్వంగా ఉందని చెప్పారు. చంద్రయాన్ కార్యక్రమానికి మహిళా శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యాన్ని జీ20 దేశాలు గుర్తించాయన్నారు.