PM Modi COVID-19 Review: ప‌ది రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ రివ్యూ మీటింగ్, కోవిడ్ పరిస్థితులు, అన్‌లాక్‌ 3 అమలు తీరుపై సీఎంలను అడిగి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) మ‌హ‌మ్మారి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్ర‌ధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కరోనా పరిస్థితిపై తెలుసుకున్నారు. ఈ భేటీలో వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రతపై ప్ర‌ధాని సమీక్ష చేశారు. లాక్‌డౌన్‌ (Lockdown) తర్వాత పరిస్థితులు, అన్‌లాక్‌ 3 (Unlock 3) అమలు జరుగుతున్న తీరుతెన్నులపై సీఎంలను ప్ర‌ధాని అడిగి తెలుసుకున్నారు.

PM Modi COVID-19 Review: ప‌ది రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని మోదీ రివ్యూ మీటింగ్, కోవిడ్ పరిస్థితులు, అన్‌లాక్‌ 3 అమలు తీరుపై సీఎంలను అడిగి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
PM Narendra Modi Holds COVID-19 Review Meeting with Chief Ministers of Around 10 States (Photo-ANI)

New Delhi, August 11: కరోనా నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ (PM Modi COVID-19 Review) నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) మ‌హ‌మ్మారి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్ర‌ధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా కరోనా పరిస్థితిపై తెలుసుకున్నారు.

ఈ భేటీలో వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రతపై ప్ర‌ధాని సమీక్ష చేశారు. లాక్‌డౌన్‌ (Lockdown) తర్వాత పరిస్థితులు, అన్‌లాక్‌ 3 (Unlock 3) అమలు జరుగుతున్న తీరుతెన్నులపై సీఎంలను ప్ర‌ధాని అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు.

Update by ANI

ఈ సమీక్షలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులతోపాటు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్, బీహార్‌‌ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక‌ రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వైద్య ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. తెలంగాణ త‌ర‌ఫున సీఎం కేసీఆర్‌తోపాటు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. దేశంలో తాజాగా 53,601 కరోనా కేసులు నమోదు, 22 లక్షలు దాటిన మొత్తం కరోనా కేసులు, గత 24 గంటల్లో 871 మరణాలు, ఇప్పటివరకు కోవిడ్-19తో 45,257 మంది మృతి

ఏపీ నుంచి సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి పాల్గొన్నారు.



సంబంధిత వార్తలు

Health Tips: చలికాలంలో అల్లం, బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా కలిగే లాభాలేమిటో తెలుసా..

Health Tips: మొక్కజొన్నలో ఉన్న ఔషధ గుణాలు తెలుసా దీని తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు తగ్గిపోతాయి..

Health Tips: ముల్లంగిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health Tips: గోరువెచ్చటి పాలలో ఒక స్పూను తేనె కలుపుకొని తాగడం వల్ల అనేక వ్యాధులు తగ్గుతాయి..