New Delhi, August 11: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో 53,601 పాజిటివ్ కేసులు (India's Coronavirus) నమోదు కాగా, 871మరణాలు సంభవించాయి. దీంతో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (COVID-19 Tally) 22,68,675కి చేరింది. ఇప్పటి వరకు 45,257 మంది కరోనా బారిన పడి మృతి (Death Toll Mounts to 45,257) చెందారు. గడిచిన 24 గంటల్లో 47,746 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 15,83,489 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారంవిడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు69.80 శాతం ఉండగా.. మరణాల రేటు 1.99 శాతంగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
జూలై 17 నాటికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 10,03,832గా ఉండగా, మృతుల సంఖ్య 25,602గా ఉంది. అయితే ఆగస్టు 7న కరోనా వైరస్ కేసుల సంఖ్య 20,27,074 కు పెరగగా, మృతుల సంఖ్య 41,585కి చేరుకుంది. దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి 110 రోజులు పట్టింది. కేసుల సంఖ్య 2 లక్షలకు చేరుకోవడానికి 14 రోజులు పట్టింది. 18 రోజుల్లో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుకుంది. కరోనా మిస్టరీ..లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటమే కారణమా? కోవిడ్ వైరస్ మోతాదులో తేడానా ? అంతా మిస్టరీయే..
కరోనా కారణంగా ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కో రాష్ట్రంలో 2000 కుపైగా మృతిచెందారు. అరుణాచల్, మిజోరం, సిక్కింలలో ఐదుగురి కంటే తక్కువ మంది మృతిచెందారు. అరుణాచల్‌లో ముగ్గురు, సిక్కింలో ఒక్కరు చొప్పున మరణించారు. మిజోరంలో కరోనా కారణంగా ఇంతవరకూ ఎవరూ మృతిచెందలేదు. కరోనాకు 2021లో అంతం తప్పదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిలియనీర్ బిల్ గేట్స్, ధనిక దేశాల్లో 2021 మే నాటికి..మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి కనుమరుగవుతుందని వెల్లడి
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 20 మిలియన్ల మంది కరోనా బారినపడగా 12.2 మిలియన్ల మందికిపైగా చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారని, 7.3 మిలియన్ల మంది మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస్ ఉద్ధృతికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. ఆ దేశంలో ఇప్పటివరకు 5 మిలియన్ల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఆ తరువాతి స్థానం బ్రెజిల్ ఆక్రమించింది. బ్రెజిల్‌లో 3 మిలియన్లకు పైగా కరోనా కేసులున్నాయి.