Modi Meditates at Vivekananda Rock Memorial: సుదీర్ఘ ధ్యానంలో ప్ర‌ధాని మోదీ, వివేకానంద రాక్ మెమోరియ‌ల్ గార్డెన్ ప్ర‌త్యేక‌త ఇదే! పార్వ‌తీ దేవీ స‌హా ప‌లువురు ధ్యానం చేసిన చోటు

గురువారం సాయంత్రం కన్యాకుమారికి (Kanyakumari) చేరుకున్న మోదీ అక్కడ వివేకానంద రాక్‌ మెమోరియల్‌ (Vivekananda Rock Memorial) వద్ద ధ్యానం (Meditation)లోకి వెళ్లిపోయారు.

Screenshot of the video (Photo Credit- X/@ANI)

Kanyakumari, May 31: సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆధ్యాత్మిక యాత్ర కోసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం కన్యాకుమారికి (Kanyakumari) చేరుకున్న మోదీ అక్కడ వివేకానంద రాక్‌ మెమోరియల్‌ (Vivekananda Rock Memorial) వద్ద ధ్యానం (Meditation)లోకి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మోదీ పరమసాధువుగా మారిపోయారు. కాషాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శామియానాపై ప్రశాంత వాతావరణంలో ధ్యానంలో కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కాగా, మోదీ క‌న్యాకుమారిలో 45 గంట‌ల పాటు ధ్యానం చేయ‌నున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

Here's News

ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల కిందట 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కేదార్‌నాథ్‌ సందర్శించారు. 2014లో ఆయన మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు సంబంధించిన ప్రతాప్‌గఢ్‌కు వెళ్లారు. ప్రధాని ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు. ఈ నిర్ణయం వెనుక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. దశాబ్దాల కిందట స్వామి వివేకానంద భారతమాత దర్శనం పొందిన ప్రదేశం కన్యాకుమారి. ఈ ప్రాంతం స్వామి వివేకానంద జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. గౌతమ బుద్ధుని జీవితంలో సారనాథ్ ఎంత ముఖ్యమైనదో.. స్వామి వివేకానంద జీవితంలో రాక్‌ మెమోరియల్‌ సైతం ప్రత్యేకమైంది.

 

దేశమంతా తిరుగుతూ కన్యాకుమారి చేరుకున్న స్వామి వివేకానంద ఇక్కడ మూడు రోజుల ధ్యానం చేశారు. ఇక్కడ శిలపైనే ఆయనకు జ్ఞానోదయం జరిగిందని ప్రతీతి. ఈ ప్రదేశంలో పార్వతీ దేవి శివుడి కోసం ఎదురుచూస్తూ ఒంటికాలిపై నిలబడి తపస్సు చేసిందని చెబుతారు.

 

భౌగోళికంగా ఈ ప్రాంతం దక్షిణాన చివరిది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్రం కలిసే ప్రదేశం కూడా. ఇదిలా ఉండగా.. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏడు దశల్లో జరిగే ఎన్నికలకు చివరిగా జూన్‌ ఒకటిన పోలింగ్‌ జరుగనున్నది. ఓట్లను జూన్‌ 4న లెక్కించనున్నారు.