PM Modi to Address Nation: నేడు ప్రధాని ప్రసంగం ఆ రెండింటి మీదనేనా ? సాయంత్రం 4 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ, కోవిడ్-19, బార్డర్ ఘర్షణలే ఇప్పుడు హాట్ టాఫిక్..
ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO Office) ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే అన్‌లాక్-2 కు (Unlock 2) సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ ( Home ministry) మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్ (Lockdown) కొనసాగుతుందని, దేశంలోని స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, థియేటర్లు కూడా జూలై 31 వరకు మూసే ఉంటాయని హోంశాఖ మార్గదర్శకాల్లో పేర్కొన్నది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
New Delhi, June 30: భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ సాయంత్రం 4 గంటలకు (PM Modi to Address Nation) జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO Office) ఆదివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే అన్‌లాక్-2 కు (Unlock 2) సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ ( Home ministry) మార్గదర్శకాలను విడుదల చేసింది.
కంటైన్మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్ (Lockdown) కొనసాగుతుందని, దేశంలోని స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, థియేటర్లు కూడా జూలై 31 వరకు మూసే ఉంటాయని హోంశాఖ మార్గదర్శకాల్లో పేర్కొన్నది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. పెళ్లయిన 2 రోజులకే వరుడిని కరోనా కాటేసింది, బీహార్‌లో పెళ్లికి వచ్చిన వారిలో 95 మందికి కోవిడ్-19, దేశంలో తాజాగా 18,522 పాజిటివ్ కేసులు నమోదు
ఈ క్రమంలో ప్రధాని మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసగించనున్నారు. ప్రధానంగా కరోనా వైరస్ వ్యాప్తి, దాని నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలపైనే ఆయన మాట్లాడే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు మరోసారి ప్రధాని కీలక సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అదేవిధంగా గల్వాన్‌లో లోయలో భారత్-చైనా దేశాల మధ్య ఘర్షణలు, తదనంతర పరిణామాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉన్నది. తాజ్‌హోటల్‌ను బాంబులతో పేల్చేస్తాం, లష్కరే తోయిబా ఉగ్రవాదుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్, అప్రమత్తమైన ముంబై పోలీసులు
దీంతో పాటుగా ప్రస్తుతం భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఆదివారం తనమాసాంతపు ‘మన్‌కీ బాత్’లో లద్దాఖ్ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్ తగిన సమాధానం చెప్పిందని ప్రధాని మోదీ తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్‌కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.