PM Modi 5th VC with CMs: ఆర్థిక పరిస్థితి సంగతేంటి, రాష్ట్రాల సీఎంలతో 3 గంటలకు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్, లాక్‌డౌన్ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం వంటి అంశాలే ప్రధాన ఎజెండా
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ (PM Modi 5th VC with CMs) ద్వారా సంభాషించనున్నారు. భవిషత్య్‌లో ఎలా ముందుకు వెళదామనే విషయంపై రాష్ట్రాల ముఖ్యమంతులతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.
New Delhi, May 11: కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లాక్‌డౌన్ 3.0 (Lockdown 3.0) ముగియడానికి మరో వారం రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ (PM Modi 5th VC with CMs) ద్వారా సంభాషించనున్నారు. భవిషత్య్‌లో ఎలా ముందుకు వెళదామనే విషయంపై రాష్ట్రాల ముఖ్యమంతులతో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. కరోనాతో 2206 మంది మృతి, దేశ వ్యాప్తంగా 67,152కి చేరిన కరోనావైరస్ కేసుల సంఖ్య, యాక్టివ్‌గా 44,029 కేసులు, నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
దేశంలో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేత (Lockdown Exit Strategy), ఆర్థిక కార్యకలాపాల పునఃప్రారంభం (Reviving Economic Activities) అంశమే ప్రధానఎజెండాగా చర్చ సాగనుంది. కోవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం రెడ్ జోన్లుగా ఉన్న వాటిని ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్పుచెందేలా చూడటం, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడంపైనే వీరు దృష్టి సారించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెడ్‌జోన్, ఆరెంజ్ జోన్‌లలో లాక్‌డౌన్ కొనసాగుతున్నా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్‌డౌన్ ఎత్తివేతపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
మార్చ్ 20వ తేదీన మొదటి సారి కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ విషయంపై సీఎంలతో మాట్లాడారు. అప్పటి నుంచి సీఎంలతో (Chief Ministers) ఇది ఐదో సమావేశం. తొలి విడత లాక్‌డౌన్ ప్రకటించే నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 606. రెండో విడత లాక్‌డౌన్ నాటికి కేసుల సంఖ్య 10,815కు పెరిగింది. మూడో విడత లాక్‌డౌన్ ప్రారంభం నాటికి 40,263కు చేరుకుంది. ఇప్పుడు ఏకంగా 63 వేలు దాటాయి. ఓ వైపు దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారుతున్నా లాక్‌డౌన్ కొనసాగిస్తుండటంతో కొద్దిగా వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నా 10 రోజుల్లో 20 వేల కేసులు పెరగడం ఆదోళన కలిగిస్తోంది.
ఈ సందర్భంగా లాక్‌డౌన్ ఆంక్షలపై మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రజా రవాణా, ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య, ఫ్యాక్టరీలు ఎలా ప్రారభించాలి. లాక్‌డౌన్ నుంచి ఎలా బయటకు రావాలి, ప్రజల జీవనోపాధికి సమస్యలు రాకుండా ఎలా ముందుకు వెళ్దాం అనే అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న వేళ కేంద్ర ఎటువంటి సహాయం అందించడం లేదని దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మండిపడుతున్నారు.
గత 24 గంటల్లో అత్యధికంగా 4,213 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. దేశంలో ధృవీకరించబడిన కరోనావైరస్ కేసుల సంఖ్య 67,152 కు పెరిగింది. వీటిలో 44,029 క్రియాశీల కేసులు కాగా, 20,917 మంది వ్యక్తులు నయమై ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. మరణాల సంఖ్య 2206 కు పెరిగింది.