PM Modi's Twitter Account Hacked: ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, బిట్ కాయిన్ విరాళాలుగా ఇవ్వాలని మెసేజ్ చేసిన హ్యాకర్లు, జాన్ విక్ పేరుతో హ్యాక్
హ్యాకర్ కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కోసం డొనేషన్ కింద బిట్ కాయిన్ డిమాండ్ చేశారు. వెనువెంటనే ఆ హ్యాకర్ బోగస్ ట్వీట్‌లను డిలీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌పై క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ ట్వీట్ వచ్చింది. ప్రధాని ట్విట్టర్ అకౌంట్‌లో ఒక మెసేజ్ వచ్చింది. దానిలో కోవిడ్-19 కోసం ఏర్పాటు చేసిన పీఎం మోదీ రిలీఫ్ ఫండ్‌కు అందరూ డొనేట్ చేయాలని కోరారు.
New Delhi, September 3: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్ కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ కోసం డొనేషన్ కింద బిట్ కాయిన్ డిమాండ్ చేశారు. వెనువెంటనే ఆ హ్యాకర్ బోగస్ ట్వీట్‌లను డిలీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్సనల్ వెబ్‌సైట్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌పై (PM Narendra Modi's Twitter Account of Personal Website) క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ ట్వీట్ వచ్చింది. ప్రధాని ట్విట్టర్ అకౌంట్‌లో ఒక మెసేజ్ వచ్చింది. దానిలో కోవిడ్-19 కోసం ఏర్పాటు చేసిన పీఎం మోదీ రిలీఫ్ ఫండ్‌కు అందరూ డొనేట్ చేయాలని కోరారు.
నరేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ (PM Narendra Modi's personal website Hacked) జాన్ విక్ పేరుతో హ్యాక్ అయ్యింది. ఈ హ్యాకర్ గ్రూప్ పేరు జాన్ విక్ అని తెలుస్తోంది. ఈ గ్రూప్ కు పేటీఎం మాల్ డేటా చోరీలో హస్తముందనే ఆరోపణలున్నాయి. పేటీఎం మాల్ యూనిఫార్మ్ అనేది పేటీఎంకు చెందిన ఈ-కామర్స్ కంపెనీ. కాగా ప్రధాని ట్విట్టర్ అకౌంట్‌కు 25 లక్షలకు మించిన ఫాలోవర్లు ఉన్నారు. బ్యాన్ అయిన చైనా యాప్స్ లిస్టు ఇదే..పబ్జీ గేమ్‌తో సహా 118 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం
2.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఈ ట్విట్టర్ హ్యాండిల్ తెల్లవారుజామున 3.15గం. సమయంలో హ్యాక్ అయినట్లు గుర్తించారు. హ్యాక్ తర్వాత కుప్పలు తెప్పలుగా పలు ఫేక్ ట్వీట్స్ ఇందులో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత సాంకేతిక నిపుణుల సహాయంతో వాటిని తొలగించారు. పబ్జీ ఇండియా నుంచి అవుట్
ఇప్పుడు భారత్‌లో క్రిప్టో కరెన్సీ(డిజిటల్ లావాదేవీలు) మొదలవుతుంది. దయచేసి 0xae073DB1e5752faFF169B1ede7E8E94bF7f80Be6 దీనికి బిట్ కాయిన్ (Bitcoin ) విరాళాలు ఇవ్వండి.' అని హ్యాక్ అనంతరం ఓ ఫేక్ ట్వీట్ ప్రధాని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయబడింది. మరో ఫేక్ ట్వీట్‌లో 'అవును ఈ ట్విట్టర్ అకౌంట్ జాన్ విక్((hckindia@tutanota.com) చేత హ్యాక్ చేయబడింది. అయితే పేటీఎం మాల్‌ను మేము హ్యాక్ చేయలేదు.' అని పేర్కొన్నారు. మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్‌పై ట్విట్టర్ ప్రతినిధులు స్పందించారు. పరిస్థితిని తాము చురుగ్గా పరిశీలిస్తున్నామని... అయితే మరిన్ని ఖాతాలు దీనికి ప్రభావితమవుతాయా అన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
ఈ ఏడాది అగస్టు 30న ఇదే జాన్ విక్ హ్యాకర్ గ్రూప్ పేటీఎం మాల్‌కు సంబంధించి భారీ ఎత్తున డేటా చోరీకి పాల్పడినట్లు సిబిల్ వెల్లడించింది. అయితే పేటీఎం మాత్రం తమ విచారణలో డేటా చోరీ ఏమీ జరగలేదని తేలినట్లు వెల్లడించింది. ఈ ఏడాది జులైలో ప్రముఖులు వారెన్ బఫెట్,జెఫ్ బెజోస్,బరాక్ ఒబామా,జో బిడెన్,బిల్ గేట్స్ ట్విట్టర్ ఖాతాల్లోనూ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులు దర్శనమిచ్చాయి. కార్పోరేట్ కంపెనీలైన ఉబర్,యాపిల్ సంస్థల ట్విట్టర్ ఖాతాలు కూడా దీని బారినపడ్డాయి. వెయ్యి డాలర్లు చెల్లిస్తే మీ చిరునామాకు 2వేల డాలర్లు పంపిస్తామన్న ఫేక్ ట్వీట్లు ఆ ఖాతాల్లో దర్శనమిచ్చాయి.