Image used for representational purpose only | (Photo Credits: Twitter)

New Delhi, September 2: సరిహద్దులో ఉద్రికత్తలు రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్‌లపై బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్‌లను (118 Chinese Apps Banned) కేంద్రం నిషేధించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్‌ ( PUBG) ఉండటంతో ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్‌, యాపిల్‌ ప్లేసోర్ట నుంచి పబ్జీని తొలగించారు. పబ్జీతో పాటు బైడు, క్యామ్‌కార్డ్‌, విచాట్‌ రీడింగ్‌, టెన్సెంట్‌ వీన్‌, సైబర్‌ హంటర్‌, లైఫ్‌ ఆఫ్టర్‌ వంటి పలు యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది.

ఇప్పటికే పబ్జీని దాదాపు 70 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ గేమ్‌కు యువత బానిసగా మారడంతో పబ్జీ గేమ్‌ను తొలగించాలని చాలాకాలంగా పలువురు కోరుతున్నారు. భద్రతా కారణాలతో టిక్‌టాక్ సహా 106 చైనా యాప్‌లను ఇటీవల భారత్‌ నిషేధించిన సంగతి తెలిసిందే.ఇటీవల టిక్‌టాక్‌తో పాటు పలు యాప్‌లను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

Government blocks 118 mobile apps List

ఈ మొబైల్స్ యాప్స్ ద్వారా దేశ, పౌరుల సమాచారం చైనాకు చేరుతున్నట్లు కేంద్రం అనుమానిస్తున్నది. ఈ నేపథ్యంలో దేశ సైబర్‌స్పేస్ భద్రత, సార్వభౌమత్వానికి సవాల్‌గా మారిన చైనాకు చెందిన 118 మొబైల్స్ యాప్స్‌పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తాజాగా నిషేధం విధించింది. ఇప్పటికే రెండు దఫాలుగా టిక్‌టాక్ సహా చైనాకు చెందిన పలు మొబైల్స్ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం, బ్యాన్ లిస్టులో షియోమి ఎంఐ బ్రౌజర్ ప్రో,బైదూ సెర్చ్

జూన్ 15న లడఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద చైనా ఘర్షణలో 20 మంది భారత్ జవాన్లు అమరులైన అనంతరం తొలుత 59, మరోసారి 49 చైనా మొబైల్స్ యాప్స్‌ను భారత్ నిషేధించింది. తాజాగా బుధవారం మరో 118 చైనా యాప్స్‌పై వేటు వేయడంతో నిషేధించిన చైనా యాప్స్ సంఖ్య 226కు చేరింది.