TikTok logo (Photo Credits: IANS)

New Delhi, June 29: భారత్- చైనా దేశాల మధ్య గత కొన్ని రోజులుగా నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుని, మంచి మార్కెట్‌ను ఏర్పర్చుకున్న టిక్‌టాక్, వీచాట్, యూసి బ్రౌజర్‌లతో సహా 59 చైనీస్ యాప్స్‌ను కేంద్రం బ్యాన్ చేసింది. చైనీస్ లింక్స్ ఉన్న ఈ యాప్స్ దేశ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని, వినియోగదారుల నిబంధనలను ఉల్లంఘిస్తూ వారి గోప్యతకు భంగం కలిగించడమే కాకుండా స్పైవేర్ లేదా మాల్వేర్‌గా ఉపయోగించబడుతున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి రిపోర్ట్స్ అందినట్లు నివేదికలు తెలిపాయి.

ఈ క్రమంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా ఆ 59 యాప్స్‌ను బ్లాక్ చేస్తున్నట్లు కేంద్ర ఐటీ, ఎలాక్ట్రానిక్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారత ప్రభుత్వం నిషేధం విధించిన చైనీస్ యాప్స్‌కు సంబంధించిన పూర్తి జాబితా కింద చూడవచ్చు.

See Full List of Chinese Apps Banned by India 

జూన్ 15న దేశ సరిహద్దు వద్ద గాల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల నడుమ ఘర్షణ చెలరేగిన దగ్గర్నించీ ఇరు దేశాల మధ్య భీకర వాతావరణం కొనసాగుతోంది. చైనాకు భారత్ దీటైన జవాబు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా పేర్కొన్నారు. దేశంలో చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన ఒక్కరోజులోనే కేంద్రం ప్రభుత్వం చైనా యాప్స్ ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటన వెలువడగానే టిక్‌టాక్ లో 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ప్రభుత్వ టిక్‌టాక్ అకౌంట్ 'MyGov' ను అధికారులు నిలిపివేశారు.

మంగళవారం సాయంత్రం 4 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

టిక్‌టాక్ సహా మొత్తం 59 చైనీస్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం. దీనిని మీరు సమర్థిస్తారా? ఎ. మంచి పని బి. సమర్థించను