New Delhi, September 2: కేంద్ర ప్రభుత్వం పబ్జీ సహా 118 చైనా యాప్స్‌ను నిషేధించింది. వీటిలో పబ్‌జీ, క్యామ్ కార్డ్, బైడు, కట్‌కట్ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం (118 Chinese Mobile Apps Banned) విధిస్తున్నట్టు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ (Ministry of Electronics and Information Technology) నిర్ణయం తీసుకుంది. గతంలో గల్వాన్ లోయ వద్ద ఘర్షణల సమయంలో దేశ భద్రత, రక్షణ దృష్ట్యా టిక్‌టాక్ సహా అనేక యాప్‌లపై కేంద్ర ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ నిషేధం విధిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ మరో భారీ దెబ్బ కొట్టింది.
భారత్‌లో ఈ గేమింగ్ యాప్‌ను అందుబాటులో లేకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. పబ్జీ యాప్‌ను (PUBG Banned in India) మన దేశంలో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు.ఈ గేమ్‌కు యువత బానిసగా మారడంతో పబ్జీ గేమ్‌ను తొలగించాలని చాలాకాలంగా పలువురు కోరుతున్నారు. భద్రతా కారణాలతో టిక్‌టాక్ సహా 106 చైనా యాప్‌లను ఇటీవల భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే.ఇటీవల టిక్‌టాక్‌తో పాటు పలు యాప్‌లను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. బ్యాన్ అయిన చైనా యాప్స్ లిస్టు ఇదే
ప్లే స్టేషన్ల, కంప్యూటర్లలో అందుబాటులో ఉన్న ఈ ఆట.. స్మార్ట్ పోన్లు వచ్చిన తర్వాత అందరి చేతుల్లోకి వచ్చిది. ఫిబ్రవరి 9, 2018న మొబైల్ వెర్షన్‌లో మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలైన తొలి ఏడాదే ప్లే స్టోర్‌లో ఉత్తమ యాప్‌గా నిలిచింది. ఆ తర్వాత లో ఎండ్ మొబైల్స్ కోసం 2019 ఆగస్టులో పబ్జీ లైట్‌ను కూడా అందుబాటులోకి నిర్వాహకులు తీసుకొచ్చారు .
ఈ మొబైల్స్ యాప్స్ ద్వారా దేశ, పౌరుల సమాచారం చైనాకు చేరుతున్నట్లు కేంద్రం అనుమానిస్తున్నది. ఈ నేపథ్యంలో దేశ సైబర్‌స్పేస్ భద్రత, సార్వభౌమత్వానికి సవాల్‌గా మారిన చైనాకు చెందిన 118 మొబైల్స్ యాప్స్‌పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తాజాగా నిషేధం విధించింది. ఇప్పటికే రెండు దఫాలుగా టిక్‌టాక్ సహా చైనాకు చెందిన పలు మొబైల్స్ యాప్స్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.
జూన్ 15న లడఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద చైనా ఘర్షణలో 20 మంది భారత్ జవాన్లు అమరులైన అనంతరం తొలుత 59, మరోసారి 49 చైనా మొబైల్స్ యాప్స్‌ను భారత్ నిషేధించింది. తాజాగా బుధవారం మరో 118 చైనా యాప్స్‌పై వేటు వేయడంతో నిషేధించిన చైనా యాప్స్ సంఖ్య 226కు చేరింది.