PM Modi on Mann Ki Baat: అందరూ జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోండి, ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి, మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ పిలుపు
దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల నేపథ్యంలో దేశ ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆగస్టు 2 నుంచి 15 దాకా జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా (Put Tricolour as Your Profile Picture ) పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
New Delhi, July 31: దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాల నేపథ్యంలో దేశ ప్రజలంతా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఆగస్టు 2 నుంచి 15 దాకా జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా (Put Tricolour as Your Profile Picture ) పెట్టుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం 91వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో (PM on Mann Ki Baat) ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15న దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను (Tricolour) ఎగురవేయాలని ప్రధాని మోదీ కోరారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు.
ఆదివారం వివిధ అంశాలపై ప్రధాని మాట్లాడుతూ.. 75 ఏళ్ల స్వాతంత‍్య్రానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోదుల పేర్లు పెట్టినట్లు గుర్తు చేశారు. అలాంటి స్టేషన్లను పిల్లలు సందర్శించాలని సూచించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షాహీద్ ఉద్ధమ్ సింగ్ జీకి సంతాపం తెలుపుతున్నాం. ఆజాదీకా అమృత్ మహోత్సవం ఒక ఉద్యమంగా సాగుతుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరు భాగస్వాములై.. ఆగస్టు 2-15 వరకు తమ ప్రొఫైల్ పిక్చర్‌గా మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలి. అలాగే.. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమం ఉంటుంది.
ఈ కార్యక్రమంలో భాగమై.. మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి.’ అని ప్రజలను కోరారు ప్రధాని మోదీ. హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతున్న మిజార్ మేళాను వీలైతే సందర్శించాలని ప్రజలను కోరారు మోదీ. మరోవైపు.. పీవీ సింధూ, నీరజ్ చోప్రాలకు శుభాకాంక్షలు తెలిపారు. యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారులు గొప్ప ఆట తీరును ప్రదర్శించాలని ఆకాక్షించారు.
పింగళి వెంకయ్య జ్ఞాపకంగా..
భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి రోజైన ఆగస్టు 2వ తేదీ నుంచి స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీ వరకు.. ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ‘‘భారత దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుంటోంది. ఈ చరిత్రాత్మక ఘట్టానికి మనందరం సాక్షులు కాబోతున్నాం.” అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13, 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల నివాసాలపై జాతీయ జెండాను ఎగరవేయనున్నట్టు అంచనా. ఈ కార్యక్రమం కోసమని జాతీయ జెండాల తయారీకి సంబంధించిన కోడ్ ను కూడా కేంద్ర ప్రభుత్వం సడలించింది. పాలిస్టర్, కాటన్, ఉన్ని, సిల్క్, ఖాదీ వస్త్రాలన్నింటినీ జాతీయ జెండా తయారీకి వినియోగించవచ్చని పేర్కొంది. జెండా పరిమాణంపైగానీ, ఎగరవేసే సమయంపైగానీ ఉన్న ఆంక్షలను కొద్దిరోజుల పాటు సడలిస్తున్నట్టు ప్రకటించింది.