Cheetahs New Names: ఆఫ్రికన్ చీతాలకు సినీ హీరోల పేర్లు, ప్రభాస్,పవన్, శౌర్య, నభా అంటూ స్టార్ల పేర్లు పెట్టిన కేంద్రం

ఇవి మన సినిమా హీరోల పేర్లు మాత్రమే కాదు. ఈ పేర్లతో కొత్త అతిథులు వచ్చారు. ఎవరా గెస్టులు అనుకుంటున్నారా? నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి మన దేశానికి విచ్చేసిన చీతాలకు పెట్టిన పేర్లలో కొన్ని ఇవి. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఉన్న చీతాలకు పెట్టిన పేర్లను కేంద్ర అటవీశాఖ మంత్రి భూపిందర్ యాదవ్ తాజాగా వెల్లడించారు.

cheetath (Photo-ANI)

New Delhi, April 21: ప్రభాస్ (Prabhas), పవన్, నభా, ఉదయ్.. ఇవి మన సినిమా హీరోల పేర్లు మాత్రమే కాదు. ఈ పేర్లతో కొత్త అతిథులు వచ్చారు. ఎవరా గెస్టులు అనుకుంటున్నారా? నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి మన దేశానికి విచ్చేసిన చీతాలకు పెట్టిన పేర్లలో కొన్ని ఇవి. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో (Kuno National Park) ఉన్న చీతాలకు పెట్టిన పేర్లను (New Cheetah Names)కేంద్ర అటవీశాఖ మంత్రి భూపిందర్ యాదవ్ తాజాగా వెల్లడించారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి మన దేశానికి తీసుకువచ్చిన 19 చీతాలకు పేర్లు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (MODI) గత సెప్టెంబర్ 25న మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను కోరిన సంగతి తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు కేంద్ర అటవీశాఖ ఆన్ లైన్ లో పోటీ నిర్వహించింది. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మొత్తం 11,565 ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 19 పేర్లను ఎంపిక చేసి.. విజేతల పేర్లను కేంద్ర అటవీశాఖ ప్రకటించింది.

విన్నర్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇక నుంచి చీతాలు కొత్త పేర్లతో పిలవబడతాయని చెప్పారు. కునో నేషనల్ పార్క్ లో ఉన్న చీతాలు ఆరోగ్యంతో హాయిగా జీవించాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు. కాగా, మనదేశంలో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకుని.. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను తీసుకొచ్చింది. వీటిలో ఒకటి చనిపోయింది.

Insurance Scam: రూ.300 కోట్ల లంచం ఆరోపణలు, ఇన్సూరెన్స్‌ కుంభకోణంలో జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ నోటీసులు  

చీతాలకు పెట్టిన పేర్లు

1. ఆశ

2. పవన్

3. నభా

4. జ్వాల

5. గౌరవ్

6. శౌర్య

7. ధాత్రి

8. దక్ష

9. నిర్వ

10. వాయు

11. అగ్ని

12. గామిని

13. తేజస్

14. వీర

15. సూరజ్

16. ధీర

17. ఉదయ్

18. ప్రభాస్

19. పవక్