Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే వారి అకౌంట్లోకి రూ. 6000, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకంలో మార్పులు చేసిన కేంద్రం
అమ్మాయిలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ కింద కొత్త పథకానికి రూపకల్పన చేసింది.ఈ పథకం కింద ఆడపిల్లలకు జన్మినిచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.మిషన్ శక్తి పథకం కింద రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.6000 సాయంగా ఇవ్వనున్న కేంద్రం తెలిపింది.
అమ్మాయిలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ శక్తి’ కింద కొత్త పథకానికి రూపకల్పన చేసింది.ఈ పథకం కింద ఆడపిల్లలకు జన్మినిచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.మిషన్ శక్తి పథకం కింద రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.6000 సాయంగా ఇవ్వనున్న కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పీఎమ్‌వీవై కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుడితే మూడు దశల్లో రూ.5 వేలు ఇస్తున్నారు. రెండో కాన్పుకు డబ్బులు అందేవి కాదు. తాజాగా దీన్ని సవరిస్తూ రెండో కాన్పులో అమ్మాయి పుడితే మాత్రమే తల్లికి రూ.6 వేలు ఇవ్వనున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంవీవై) కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినప్పటికీ మూడు దశల్లో రూ.5వేలు చెల్లిస్తోంది. మహిళ గర్భం దాల్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదుకాగానే రూ.1,000, ఆరు నెలల తర్వాత రూ.2,000, ప్రసవం జరిగిన 14 వారాల్లో ఇమ్యూనైజేషన్ సైకిల్ పూర్తయ్యాక రూ.2,000 చొప్పున అందజేస్తుంది.
ఈ పథకంలో రెండో కాన్పునకు ఆర్థిక లబ్ధి వర్తించేది కాదు. దీన్ని సవరిస్తూ.. రెండో కాన్పులో అమ్మాయి పుడితే మాత్రమే తల్లికి రూ.6వేలు ఇచ్చేలా మార్పుచేశారు. రెండో ప్రసవంలో కవలలు జన్మించి, వారిలో ఒక అమ్మాయి ఉన్నా పథకం వర్తిస్తుంది. జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. గర్భస్రావాలు తగ్గించడంతో పాటు తల్లిదండ్రులకు ఆర్థిక వెసులుబాటును ఇచ్చేందుకు ‘మిషన్ శక్తి’లో దీన్ని చేర్చినట్లు కేంద్రం చెబుతోంది.
ఇక, తొలిసారి గర్భం దాల్చినప్పుడు మూడు దశల్లో అందించే రూ.5వేల ఆర్థిక సహాయం పంపిణీలోనూ మార్పులు చేయబోతుంది. గర్భం దాల్చినప్పుడు రూ.3,000, ప్రసవం జరిగిన 14 వారాలకు రూ.2,000 చొప్పున రెండు విడతల్లోనే ఇవ్వనుంది.