Prahlad Dies: విషాదం..బోరు బావిలో పడిన బాలుడు మృతి, 90 గంటల పాటు బాలుడి కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర బృందాలు పడిన శ్రమ వృథా, రూ. 5 లక్షలు నష్టపరిహారం అందజేస్తామని తెలిపిన సీఎం చౌహాన్

మధ్యప్రదేశ్‌లోని నివాడీ జిల్లాకు చెందిన పృధ్వీపూర్ పరిధిలో మూడు రోజుల క్రితం బోరుబావిలో (borewell) పడిన ప్రహ్లాద్ అనే చిన్నారి మృతి (Prahlad dies in borewell) చెందాడు. ఆ బాలుడిని బయటకు తెచ్చేందుకు 90 గంటల పాటు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ వృథాగా మారింది.

Three-year-old Prahlad falls into open borewell in Madhya Pradesh's Niwari (Photo Credits: ANI)

Niwari, November 8: బోరు బావిలో పడిన చిన్నారి కథ విషాదంగా ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని నివాడీ జిల్లాకు చెందిన పృధ్వీపూర్ పరిధిలో మూడు రోజుల క్రితం బోరుబావిలో (borewell) పడిన ప్రహ్లాద్ అనే చిన్నారి మృతి (Prahlad dies in borewell) చెందాడు. ఆ బాలుడిని బయటకు తెచ్చేందుకు 90 గంటల పాటు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ వృథాగా మారింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర బృందాలు రాత్రనక పగలనక శ్రమించి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఆ బాలుని మృతదేహాన్ని బొరు బావి నుంచి వెలికితీశాయి.

ఈ విషాద దుర్ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఒక ట్వీట్‌లో ఆయన... సౌత్‌పూర్ గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి ప్రహ్లద్‌ను వెలికి తీసేందుకు 90 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ, ఫలితం లేకపోవడం ఎంతో ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు.ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని అభిలషించారు. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు నష్టపరిహారంగా అందజేస్తామని తెలిపారు.

Madhya Pradesh CM Tweet

కాగా నివారీ జిల్లాలోని సెట్పురాలోని ఒక పొలం సమీపంలో ఆడుతున్నప్పుడు ప్రహ్లాద్ బుధవారం ఉదయం బోర్‌వెల్‌లో పడిపోయాడు. అతను సుమారు 200 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. ఆ బాలుడిని క్షేమంగా తీసుకురావడానికి మూడు రొజుల పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర బృందాలు శ్రమించాయి. చివరకు ఆ బాలుడి కథ విషాదంగా ముగిసింది.